భారత్ బంద్ వల్ల ధరలైతే పెద్దగా తగ్గలేదు...కానీ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.! ఇదెక్కడి న్యాయం.?  

Death Of 2-year-old Girl Due To Bharat Bandh-

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ భగ్గుమంటూ శుక్రవారం ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించాయి. ఇంధన ధరలపై ప్రతిపక్ష పార్టీలు 10 వ తేదీన భారత్ బంద్ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ బంద్ లో అపశృతి చోటుచేసుకుంది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న ఓ బాలిక ట్రాఫిక్‌లో చిక్కుకుని రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది...

భారత్ బంద్ వల్ల ధరలైతే పెద్దగా తగ్గలేదు...కానీ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.! ఇదెక్కడి న్యాయం.?-Death Of 2-year-old Girl Due To Bharat Bandh

ఈ ఘటన బీహార్‌లోని జహనాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళ్తే. నిరసనకారులు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించడంతో… జహనాబాద్ ప్రభుత్వాసుపత్రికి బాలికను తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డుపైనే ఇరుక్కుపోయింది. దీంతో కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది..

ఆ చిన్నారి తల్లితండ్రులు మాట్లాడుతూ…”వాళ్లు అంబులెన్స్‌ను ముందుకు వెళ్లనిచ్చే ఉంటే మా పాపను ప్రాణాలతో కాపాడుకునేందుకు అవకాశం ఉండేది అన్నారు. ” ఇది ఇలా ఉండగా.ఇంధన ధరలపై విపక్షాలు బీహార్‌‌లో చేపట్టిన భారత్ బంద్‌తో రైలు, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, వామపక్షాలు, హిందూస్థానీ అవామ్ మోర్చా భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.