ఆ పొత్తు టీడీపీ కి నష్టం తెస్తుందా ... తెలంగాణలోనూ అంతేనా  

  • పొత్తు రాజకీయాలు చిత్ర విచిత్రం గా ఉంటాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోవడం వల్ల ఒక్కోసారి ఒక్కో పార్టీకి కలిసివస్తే మరో పార్టీ ఘోరంగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా అటు ఇటు కాని పరిస్థితుల్లో పడిపోయింది. టీడీపీకి ఆజన్మ విరోధి అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీ లో మెజార్టీ నాయకులు ఎవరకి ఇష్టంలేదు. అయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ అవసరాల నిమిత్తం కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధం అయ్యాడు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోయే తెలంగాణాలో ఆ రెండు పార్టీల పొత్తు ఖాయం అయిపొయింది. సీట్ల పంపకం కూడా ఒక కొలిక్కి వచ్చేసింది.

  • Congress Tdp Ally Effect On Andhra Pradesh Tdp-

    Congress Tdp Ally Effect On Andhra Pradesh Tdp

  • తెలంగాణాలో టీడీపీ బలం అంతంత మాత్రమే. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లు అంతంత మాత్రమే. తెలంగాణ కు అనుకూలంగా తాను లేక ఇచ్చానని చెప్పుకున్నా ప్రయోజనం కలగలేదు.అలా గెలిచిన వాళ్లు కూడా ఫిరాయించేశారు. ఇక ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే ఆ క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ ఎన్నికల్లో జీరో అయ్యింది టీడీపీ. ఇప్పుడు సొంతంగా వెళ్లినా అదే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు బాబు సిద్ధం అయిపోతున్నాడు.

  • Congress Tdp Ally Effect On Andhra Pradesh Tdp-
  • కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతోంది. ఇదీ కథ. మహా అంటే కాంగ్రెస్ పార్టీ గట్టిగా అయితే తెలంగాణాలో టీడీపీ కి కాంగ్రెస్ పార్టీ సుమారు పదిహేను వరకు సీట్లు కేటయించే అవకాశం ఉంది. అయితే దాని వల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం శున్యం. కానీ ఆ పొత్తు వలన టీడీపీ ఏపీలో ఘోరంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు బద్ద శత్రువులు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకు ఇప్పటివరకు టీడీపీ కి పడుతూ వస్తోంది. అయితే ఇప్పడు ఆ అవకాశం ఉండదు. కాంగ్రెస్ వ్యతిరేకులు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ కి ఓటు వేసే అవకాశం ఉండదు ఇంకో పార్టీకి ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఏపీలో టీడీపీ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయం. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.