రాజకీయాల్లో రాములమ్మ ఎక్కడ...అలకా.. అజ్ఞాతమా ...  

Congress Searching For Vijayashanthi But Where She Is-

తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగువెలిగి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగానే కాక కేసీఆర్ చెల్లి అనే హోదా కూడా దక్కించుకున్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ తో విబేధాలు వచ్చాక కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె ఆ పార్టీలో కూడా యాక్టీవ్ గా కనిపించడంలేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి..

రాజకీయాల్లో రాములమ్మ ఎక్కడ...అలకా.. అజ్ఞాతమా ...-Congress Searching For Vijayashanthi But Where She Is

అసెంబ్లీ కూడా రద్దు అయిపొయింది. అయినా ఆమె ఆచూకీ మాత్రం కనిపించడంలేదు.

ముందస్తు వేడితో తెలంగాణ రగులుతుంటే విజయశాంతి యాక్టివ్‌గా లేకపోవడమేంటి రాములమ్మను అధిష్టానం పట్టించుకోవడం లేదా లేదంటే ఆమెనే అలిగారా? ఇంతకీ రాముల్మ ఎక్కడ? ఇలా అనేక ప్రశ్నలు తెలంగాణ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి.
దీంతో క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నట్టు ప్రకటించారు. అయితే, తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిపెట్టడం, రాహుల్ గాంధీ నాయకత్వం తీసుకోవడంతో, మళ్లీ కాంగ్రెస్‌ వైపు నడిచారు విజయశాంతి. రాహుల్ సమక్షంలోనే మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు..

కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాహుల్‌ గాంధీ ఇటీవలె తెలంగాణలో రెండురోజుల పాటు విస్తృతంగా పర్యటించారు.

కానీ విజయశాంతి మాత్రం రాహుల్ టూర్‌లో కనిపించలేదు.

కానీ తననే కాంగ్రెస్‌ పెద్దలు దూరంగా పెట్టారని ఆమె ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరపున విజయశాంతి ప్రచారం చేపడితే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఆమె మాటల తూటాలు ఖచ్చితంగా కేసీఆర్ పార్టీని ఇరుకునపెడతాయని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ పెరుగుతుందని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే అసలు రాములమ్మ మనసులో ఏముందో .

? ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ. అజ్ఞాతవాసం ఎందుకు గడుపుతున్నారో ఇవన్నీ తేలితే కానీ కాంగ్రెస్ పెద్దల ప్లాన్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ కనిపించడంలేదు.