ఆ విషయంలో 'రమ్య కృష్ణ' కు పోటీ ఎవరో తెలుసా.? అలా జరిగితే ఇక రమ్యకు ఇబ్బందే.!  

  • బాహుబలిలో శివగామిగా ఏ ముహూర్తంలో ఆఫర్ వచ్చిందో కానీ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాలీవుడ్ లో ఇప్పుడు తనే. హీరోయిన్ గా అగ్ర స్థానాన్ని కొన్నేళ్ల పాటు చవిచూసిన రమ్యకృష్ణ ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రత్యేకించి ‘బాహుబలి’ సినిమాతో ర‌మ్య‌కృష్ణ‌ ఇమేజ్ రెట్టింపు అయ్యింది. రమ్యకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టారడ‌మ్ రెట్టింపు అయ్యింది.తాజాగా ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదల కాబోతోంది. నాగ చైతన్యకు అత్తగా ఈ సినిమాలో ఆమె నటన ఆడియన్స్ కి తప్పక నచ్చుతుంది అని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.

  • Competition Between Ramya Krishna And Nadiya For Movie Roles-

    Competition Between Ramya Krishna And Nadiya For Movie Roles

  • హీరోయిన్ గా ఉన్నప్పుడు మాత్రమే కాదు…అత్త పత్రాలు వేసేటప్పుడు కూడా రమ్యకృష్ణ కు పోటీ ఉంది. ఇప్పటికే అత్త పాత్రల్లో నదియా “అత్తారింటికి దారేది, అఆ” చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా హిట్ అయితే నదియకు రమ్యకృష్ణకు మధ్యన పాత్రల విషయంలో పోటీ మొదలైనట్టే. ఇక పారితోషికం విషయంలో వీరిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నారని టాక్.

  • Competition Between Ramya Krishna And Nadiya For Movie Roles-
  • అత్యధికంగా రోజుకు 6 లక్షల దాకా ఛార్జ్ చేస్తుందట శివగామి. షూటింగ్ కోసం ఎన్ని కాల్ షీట్స్ కావాలంటే అన్ని ఆరు లక్షలు మల్టి ప్లై చేసుకోవాలన్న మాట. ఇప్పుడు లీడింగ్ హీరోయిన్లు కోటి రూపాయల స్థాయి పారితోషకం తీసుకుంటుంటే, రమ్య అంతకు మించి పొందుతోందని టాక్. ఒక సినిమాలో రమ్య ఫుల్‌లెంగ్త్ పాత్ర చేసిందంటే ఇరవై రోజుల డేట్స్ అయినా అవసరం అవుతాయి. ఒక్కోసారి అంతకు మించి కూడా అవసరం కావొచ్చు. ఇలా చూస్తే రమ్య ఏదైనా ప్రాధాన్యత ఉన్న పాత్రను చేస్తే ఆ సినిమాకు రెమ్యూనరేషన్‌గా కోటి రూపాయల పై మొత్తాన్నే అందుకునే అవకాశం ఉంది.ఒకవేళ నదియా గనుక రెమ్యూనరేషన్ తగ్గిస్తే…రమ్య కృష్ణకు పెద్ద సమస్యగా మారుతుంది . నిర్మాతలు అందరు నదియా గారికే పత్రాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. ఇక శైలజ రెడ్డి అల్లుడు ప్లాప్ అయితే రమ్య రెమ్యూనరేషన్ కూడా తగ్గిపోతుంది. మరి ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి అంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.!