వైఎస్ వివేకానంద మర్డర్ పై జగన్ ఆరోపణలని ఖండించిన చంద్రబాబు  

వైఎస్ వివేకానంద మర్డర్ వెనుక ఎవరు వున్న చట్టం వదిలిపెట్టదు అని స్పష్టం చేసిన చంద్రబాబు. .

Chandrababu Serious On Jagan-tdp,ysrcp

వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యలో చంద్రబాబు హస్తం ఉందని, ఏపీ పోలీసుల పని తీరు సరిగా లేదని సిబిఐ విచారణ చేసి నిందితులని పట్టుకోవాలని జగన్ వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముందుకొచ్చారు. జగన్ చేసిన ఆరోపణలు తనపై బురదజల్లే విధంగా ఉన్నాయని చంద్రబాబు విమర్శలు చేసారు.

అసలు వివేకానంద హత్య తీరు చూస్తుంటే చాలా అనుమానాలు కలుగుతున్నాయని, మొదటిగా గుండెపోటు అని చెప్పారని, ఇంట్లో ఉన్న రక్తం అంతా క్లీన్ చేసి సాక్ష్యాలు మాయం చేసిన తర్వాత ఇది హత్య అని పోలీసులు నిర్దారించడంతో జగన్ కొత్త రాజకీయం మొదలెట్టాడని, తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వారి కుటుంబంలో జరిగిన వివేకానంద హత్యలో ఎవరు ఉన్న సాక్ష్యాధారాలతో సహా బయటకి తీసుకొచ్చి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ హత్య నేరం కారు డ్రైవర్ పై నెట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పడం సిగ్గుచేటని అన్న బాబు, దీనిపై సిట్ విచారణ చేసి నిజానిజాలు బయటకి తీస్తుందని చెప్పుకొచ్చారు.