టి.టీడీపీని వదిలించుకుంటున్న బాబు ! ప్రచారానికి కూడా దూరమేనా ..  

Chandrababu Naidu Not Campaigning In Telangana Tdp-

It's great when you know where and where to fall! Everybody usually thinks. But politician is a politician who knows where to promote and not where to live in politics. He is the AP CM Chandrababu Naidu. The Telugu Desam Party is also preparing for the elections as all parties are in the forefront in Telangana. But when AP, Telangana split, TDP survived in Telangana. They are joining the party that they like to say they are the way they are. The only people who are present are holding this party only. At this stage, the TDP president Chandrababu seems unlikely to participate in the Telangana election.

.

Chandrababu seems to be acting as anti-immortal in the Telangana Pre-election. The local leaders of Telangana are going to go forward and say that Chandrababu is saying that he is just a bit odd and cooperating. He is also saying that he is the chief minister of AP and can not be given a full time campaign. Many feel that this is a signal to the Telangana TDP party that it has left to its karma. .

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు ! అని సాధారణంగా అందరూ అనుకొంటారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కడ ప్రచారం చెయ్యాలో కాదు ఎక్కడ ప్రచారం చెయ్యకూడదో తెలిసినవాడే రాజకీయ నాయకుడు. అతడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...

టి.టీడీపీని వదిలించుకుంటున్న బాబు ! ప్రచారానికి కూడా దూరమేనా ..-Chandrababu Naidu Not Campaigning In Telangana Tdp

తెలంగాణాలో ముందస్తు సందడి మొదలవ్వడంతో అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. అయితే ఏపీ, తెలంగాణ విడిపోయాక తెలంగాణాలో టీడీపీ మనుగడ కోల్పోయింది. నాయకులంతా తమ దారి తమదే అన్నట్టు ఎవరికీ నచ్చిన పార్టీలో వారు చేరిపోయారు.

ఇప్పుడు ఉన్నవారు కూడా ఏ అవకాశం దొరక్క మాత్రమే ఈ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు. ఈ దశలో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పాల్గొనే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికల విషయంలో చంద్రబాబు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించబోతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ స్థానిక నేతలే ముందుకు వెళ్లాలని , తాను కేవలం అండగా ఉండి సహకరిస్తానని చంద్రబాబు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాను ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నాను గనుక ప్రచారానికి పూర్తి సమయం కేటాయించలేను అని కూడా ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీని దాని ఖర్మానికి దానికి వదిలేశారనడానికి ఇది సంకేతం అని పలువురు భావిస్తున్నారు...

తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంత తిరిగినా … ప్రచారం చేసినా టీడీపీ కి ఓట్లు రాలే పరిస్థితి లేదు. అలాంటప్పుడు అనవసరంగా తాను రంగంలోకి దిగి పరువు పోగొట్టుకోవడం కంటే.

ప్రచారానికి దూరంగా ఉండి పరువు దక్కించుకోవడమే బెటర్ అన్న ఆలోచనలో బాబు ఉన్నాడు. ఇందుకు మానసికంగా తెలంగాణ టీడీపీ నేతలను కూడా సిద్ధం చేస్తున్నాడు...

అంటే తెలంగాణాలో టీడీపీ పని అయిపోయిందని బాబు ముందే ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఇక అందుకే కొంతలో కొంత ఊరట పొందడానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తన ఉనికి చాటుకునేందుకు టీడీపీ చూస్తోంది.