బాబు కి తలనొప్పిగా మారిన జేసి ! అనంతలో రచ్చ రచ్చ  

Chandrababu Naidu Gets Headache About Jc Diwakar Reddy-

అనంతపురం టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి రూటు ఎప్పుడూ సెపరేటుగానే ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా … అనంతపురంలో మాత్రం జేసీ హవానే నడుస్తుంది. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా లెక్కచేయకుండా తన నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడడం జేసి స్టైల్. ముక్కుసూటిగా ముందుకు వెళ్లడం ఆయన నైజం...

బాబు కి తలనొప్పిగా మారిన జేసి ! అనంతలో రచ్చ రచ్చ -Chandrababu Naidu Gets Headache About JC Diwakar Reddy

ఆయన ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నా ప్రభుత్వాలు ఆయనకు ఎదురెళ్లడానికి వెనకంజ వేస్తుంటాయి. అంటే జేసి కి ఆ జిల్లాలో ఎంత పట్టు ఉందో అర్ధం అవుతుంది. తాజాగా ప్రభోదానంద ఆశ్రమ స్వామీజీ తనను గౌరవించడం లేదని జేసీ దివాకరరెడ్డి నానా రచ్చా చేస్తున్నాడు.

అది కాస్త ముదిరి ఇప్పుడు పోలీస్ వర్సెస్ జేసీ అన్నట్టుగా తయారయ్యింది పరిస్థితి.

జేసీకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తూనే మరోవైపు స్వామీజీకి తెరవెనుక చంద్రబాబు మద్దతు పలుకుతున్నట్టు జేసీ అనుమానిస్తున్నారు. బాబు నైజం వెన్నుపోటు రాజకీయంలా ఉందని జేసీ తన అనుచరులతో చెప్పుకుంటున్నాడు. చంద్రబాబును మెప్పించడం కోసం జగన్‌కి పూర్తిగా శతృవు అవుతూ జగన్‌తో పాటు వైఎస్ కుటుంబంపై కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు జేసి.

అయినా… చంద్రబాబు మాత్రం జేసీలను ఏ విషయంలోనూ కనికరిచండం లేదు. ఇక ఇప్పుడు అనంతపురంలో జేసీల పరువుకు సంబంధించిన విషయంలో కూడా జేసీలకు హ్యాండ్ ఇచ్చాడు చంద్రబాబు. ..

బాబు రాజకీయం గురించి ముందే పసిగట్టిన జేసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం గురించి ఆలోచిస్తున్నాడు. జేసీల కొడుకులతో పాటు, ముఖ్య అనుచరులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి స్థానాన్ని గెలుచుకోవాలని అప్పుడు అన్ని పార్టీలు తన కాళ్ళ దగ్గరకే వస్తాయని చూస్తున్నాడు.

ఈ విషయం బాబు వరకు వెళ్లడంతో ఆందోళన చెందుతున్నాడు.

అందుకే జేసీలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. అయితే జేసీ అడుగుతున్నట్టుగా ఆరు నుంచి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు జేసీ దివాకరరెడ్డి చెప్పినవాళ్ళకు ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నాడు. ఈ మొత్తం వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

జేసీలు కనుక స్వతంత్ర అభ్యర్థులుగా దిగితే మాత్రం అనంతపురంలో వైసీపీకి మేలు జరుగుంతుందని బాబు భయం అందుకే జేసీ ఏమి చేసినా పట్టించుకోనట్టు కనిపిస్తున్నాడు.