టీడీపీ అభ్యర్ధుల మొదటి జాబితా సిద్దం..లిస్ట్ ఇదే  

Chandrababu Naidu Features In Tdp’s 1st Candidate List For Seemandhra-

తెలుగు రాష్ట్రాలో ఎన్నికల హడావిడి కోలాహలంగా ఉంటోంది.ముఖ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్ధుల ఎంపికలో ముందస్తుకి తగ్గట్టుగానే ముందున్నాయి కేసీఆర్ అయితే ఏకంగా అసెంబ్లీ రద్దు జరిగిన గంటల వ్యవధిలోనే అభ్యర్ధులని ప్రకటించి సంచలనం సృష్టించారు ఇదిలాఉంటే కాంగ్రెస్ మహా కూటమి లోని పార్టీలు సైతం అభ్యర్ధుల ఎంపికలో ముందున్నాయి అంతేకాదు టీడీపీ అధినేత తెలంగాణలో అభ్యర్ధుల విషయంలో ఒక క్లారిటీతోనే ఉన్నారు.

టీడీపీ అభ్యర్ధుల మొదటి జాబితా సిద్దం..లిస్ట్ ఇదే-Chandrababu Naidu Features In TDP’s 1st Candidate List For Seemandhra

అయితే ఏపీలో ఎన్నికలకి ఇంకాస్త సమయం ఉందన్న కారణంగా ఏ పార్టీ కూడా బహిరంగంగా అభ్యర్ధుల ప్రకటన చేయలేదు దాంతో వివిధ పార్టీల నేతల్లో , సిట్టింగు ఎమ్మెల్యేలలో టెన్షన్ వాతావరం కనిపిస్తోంది.అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా కొంత మంది అభ్యర్ధులని ప్రకటించారు కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో వెనుకపడి ఉన్నారని టాక్ వినిపించింది అయితే చంద్రబాబు ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్ధుల విషయంలో ఒక క్లారిటీ తోనే ఉన్నారట అంతేకాదు

జరుగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల అభ్యర్ధుల విషయంలో బాబు ఆచి తూచి వ్యవహరిస్తున్నారట.అయితే తాజగా వారం రోజుల క్రితమే టీడీపీ పోటీ చేసే అభ్యర్ధుల ఫస్ట్ లిస్టు సిద్దం చేశారట ఈ లిస్టు లో సిట్టింగులకి సైతం పెద్దపీట వేశారట వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు మీకే మీ పనుల్లో మీరు ఉండండి అన్నట్టుగా చూచాయిగా కూడా వారికి తెలియచేశారని తెలుస్తోంది.చంద్రబాబు డిసైడ్ చేసిన మొదటి అభ్యర్ధుల లిస్టు ఒక్క సారి పరిశీలిస్తే..

1 . పెనమలూరు – నారా లోకేష్

2 . ప్రత్తిపాడు – కూచిపూడి విజయ.

3 . బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ

4 . పీలేరు – కిషోర్ కుమార్ రెడ్డి

5 . పుంగనూరు – అనుష రెడ్డి

6 . చింతలపూడి – పీతల సుజాత.

7 . రాజాం – కొండ్రు మురళి.

8 . చంద్రగిరి – పులపర్తి నాని.

9 . విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్.

10. గన్నవరం – వల్లభనేని వంశీ మోహన్

11 . మైలవరం – దేవినేని ఉమా మహేశ్వరావు.

12 . పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

13 . ఉండి – కలువ పూడి శివ

14 . తణుకు –ఆరవెల్లి రాధాకృష్ణ.

15 . దెందులూరు – చింతమనేని ప్రభాకర్.

16 . కైకలూరు – మాగంటి బాబు

17 . కాకినాడ (రూరల్) – పిల్లి అనంతలక్ష్మీ.

18 . రాప్తాడు – పరిటాల అనంత శ్రీరాం

19 . మైదుకూరు – డీఎల్ రవీంద్ర రెడ్డి.

20 . హిందూపురం – బాలకృష్ణ