వంకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం  

Brinjal Health Benefits-

వంకాయ కూర తినని వారు ఎవరు ఉండరు. వంకాయ అంటే అంత ఇష్టం మరి. అంతేకాక వంకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. వంకాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న వంకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వంకాయల్లో పాస్ఫరస్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6, ప్రోటీన్లు, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, ఫోలేట్, విటమిన్ కె తదితర అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి.

వంకాయలో ఉండే విత్తనాలలోను మంచి పోషకాలు ఉన్నాయి. వీటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అంతేకాక మూత్రాశయ వ్యవస్థ బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.

Brinjal Health Benefits-

Brinjal Health Benefits

వంకాయలను తరచుగా తింటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. దీనితో గుణే జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

వంకాయల్లో ఆంథోసయనిన్స్ సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండి ఎటువంటి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. ఈ విధంగా రక్తసరఫరా బాగా ఉండుట వలన మెదడు బాగా యాక్టివ్ గా పనిచేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఏ పనిని అయినా చురుగ్గా చేస్తారు.