పెట్రోల్ ధరలపై బీజేపీ ట్వీట్.! వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకోడం అంటే ఇదే.! చూసి నవ్వుకోండి.!  

Bjp Tweets Faulty Graph On Fuel Price Hike-

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై భారతీయ జనతా పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన గ్రాఫ్‌ను చూసి నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. ఈ గ్రాఫ్‌లో రూ.71.14 కంటే. రూ.80.73 తక్కువ అని చూపడం గమనార్హం. దీన్ని చూసిన నెటిజన్లు. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ మండిపడుతున్నారు...

పెట్రోల్ ధరలపై బీజేపీ ట్వీట్.! వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకోడం అంటే ఇదే.! చూసి నవ్వుకోండి.!-BJP Tweets Faulty Graph On Fuel Price Hike

విపక్షాల బంద్‌ను నిరసిస్తూ… బీజేపీ తన ట్విట్టర్‌లో రెండు గ్రాఫ్‌లు పోస్ట్‌ చేసింది. అందులో… ఢిల్లీలో 2014 మేలో లీటరు పెట్రోలు 71.41 ఉండగా. ఇప్పుడు 80.73 ఉన్నట్లు తెలిపింది. కానీ… 71.41కంటే 80.73 సంకేతాన్ని బాగా తగ్గించి, ధర కిందికి పడిపోయినట్లుగా బాణం గుర్తు వేసింది. ‘శాతాల్లో పెట్రో ధరల పెంపు… ఇదీ అసలు వాస్తవం’ అంటూ దానికో శీర్షిక కూడా పెట్టింది. పెంపును కూడా తగ్గింపులా చూపడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు!

అంటే రూ..

80.73 కంటే 71 రూపాయలే ఎక్కువ అని చెబుతూ బీజేపీ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. అంకెలు రానివాళ్లు దేశాన్ని పాలిస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించి బీజేపీనే ఇరుకున పడిందని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి 71 ఎక్కువా? 80 ఎక్కువా? చిన్న పిల్లాడు కూడా 80 ఎక్కువని చెప్పేస్తారు. బీజేపీ నేతలు మాత్రం 80 కంటే 71 ఎక్కువని తేల్చేశారు.