చిన్నమ్మకు పెద్ద బిస్కెట్ ! బీజేపీ అసలు ప్లాన్ ఇదే !  

  • సరైన పదవి దక్కలేదనో తమ హోదాకు తగ్గ గౌరవం డగక్కలేదనో, లేక ప్రస్తుత పార్టీలో కంటే మరో పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కుంతుందనే ఆలోచనతో నాయకులు పార్టీలు మారిపోతుంటారు. ఆ నాయకుల వల్ల తమ పార్టీకి కలిసివస్తుందనుకుంటే ముందుజాగ్రత్తగా వారికి ఏదో ఒక పదవి ఇచ్చి పార్టీ మారిపోకుండా అధిష్టానం చర్యలు తీసుకుంటుంది.

  • BJP Gives Nominated Post For Purandeswari In Air India Board-

    BJP Gives Nominated Post For Purandeswari In Air India Board

  • ప్రస్తుతం ఇలాంటి పరిణామమే ఏపీ బీజేపీలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రి హోదాలో పని చేసి ఏపీ విభజన సమయంలో వైసీపీలో చేరిన దగ్గుపాటి పురందరేశ్వరి కి ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం ప్రయత్నిస్తూ వైసీపీలోకి జంప్ చేయాలనీ చూసారు. పురందేశ్వరి వచ్చి చేరితే జగన్ సీటు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని ప్రచారం జరిగింది. విజయవాడ ఎంపీ సీటును కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడని అలాగే పురందేశ్వరి తనయుడు ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయడానికి కూడా జగన్ ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది.

  • ఈ ప్రతిపాదనల నేపథ్యంలో దగ్గుబాటి కుటుంబం మొత్తం వైసీపీలోకి చేరుతుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. ఇప్పటికే అంతంత మాత్రం గా ఉన్న పార్టీ పరిస్థితి పురందరేశ్వరి వెళ్ళిపోతే మరింత దిగజారుతోంది అని భావించి హడావుడిగా ఆమెకు ఒక నామినేటెడ్ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

  • BJP Gives Nominated Post For Purandeswari In Air India Board-
  • కాంగ్రెస్ హయాంలో పురందేశ్వరి కేంద్ర మంత్రి స్థాయిలో పని చేసినప్పటికీ ఆమెకు బీజేపీ ఇన్నాళ్లూ ఎలాంటి ప్రాధాన్యతనూ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇలా నామినేటెడ్ పోస్టును ఇచ్చి ఆమె ఆలోచనలకూ బ్రేక్ వేసింది. ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా బోర్డ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌‌గా ఆమెకు పదవి కట్టబెట్టింది. అయితే ఆమె ఈ పదవితో సరిపెట్టుకుంటారా లేక కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పదవితోపాటు పార్టీని వదులుకుంటారా అనేది చూడాలి.