బిత్తిరోడు హీరో వేశాలు.. సక్సెస్‌ అయ్యేనా?  

  • వి6 తీన్మార్‌ వార్తలు చూసే వారికి బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన బిత్తిరి సత్తి కేవలం తీన్మార్‌ వార్తల ద్వారానే కాకుండా పలు రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈయన వెండి తెరపై కూడా కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు. వెండి తెర పైకి ఈయన ‘తుపాకి రాముడు’ అనే చిత్రంతో రాబోతున్నాడు. తనకున్న బిత్తిరి ఇమేజ్‌ను ఉపయోగించుకుని ఈ చిత్రంను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

  • Bithiri Sathi Tupaki Ramudu Movie Updates-

    Bithiri Sathi Tupaki Ramudu Movie Updates

  • ఈ చిత్రాన్ని రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్న కారణంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. భారీ ఎత్తున ఈ చిత్రంను తెరకెక్కిస్తున్న దర్శకుడు ప్రభాకర్‌ త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇటీవలే సుకుమార్‌ చేతుల మీదుగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను లాంచ్‌ చేయించడం జరిగింది. తుపాకి రాముడు ఫస్ట్‌లుక్‌కు సోషల్‌ మీడియాలో మంచి టాక్‌ దక్కింది. తెలుగులో ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

  • Bithiri Sathi Tupaki Ramudu Movie Updates-
  • బిత్తిరోడు ఇప్పటికే పలు చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించాడు. అయితే సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించడం మాత్రం ఇదే ప్రథమం. కమెడియన్స్‌గా చేసిన వారు ఎంతో మంది ఆ తర్వాత హీరోలుగా మారిన విషయం తెల్సిందే. అందరి మాదిరిగానే బిత్తిరి సత్తి కూడా కమెడియన్‌ నుండి హీరోగా మారబోతున్నాడు. ఎంతో మంది కమెడియన్స్‌ హీరోలుగా సక్సెస్‌ కాలేక పోయారు. మరి బిత్తిరోడు హీరోగా సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది త్వరలోనే తేలిపోనుంది. ఈ చిత్రం తమిళనాట భారీ ఎత్తున విడుదల చేయడంతో పాటు, ఏపీలో కూడా పలు థియేటర్లలో విడుదల చేస్తామంటూ నిర్మాత రసమయి చెబుతున్నాడు.