మొన్న బిగ్‌బాస్‌ నుండి ఎలిమినేషన్‌, నిన్న ప్రేయసితో వివాహం  

Bigg Boss Tamil 2 Fame Danny Annie Pop Gets Married!-

తెలుగు బిగ్‌బాస్‌తో పాటు తమిళ బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ ప్రారంభం అయిన విషయం తెల్సిందే. తెలుగు బిగ్‌ బాస్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళ బిగ్‌బాస్‌కు గత రెండు సీజన్‌లుగా కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌కు ఏ స్థాయి గుర్తింపు దక్కుతుందో అంతకు మించి తమిళ బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్లకు క్రేజ్‌ దక్కుతుంది. సామాన్య సెలబ్రెటీలుగా ఇంట్లోకి వెళ్లిన పలువురు స్టార్స్‌ అయ్యారు. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ముందు డేనియల్‌ అన్నె గురించి పెద్దగా ఎవరికి తెలియదు.

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో దాదాపు 11 వారాలు కొనసాగిన డేనియల్‌ అన్నెకు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ దక్కింది. ఫైనల్‌ వరకు ఈయన వెళ్తాడని అంతా అనుకున్నారు. కాని డేనియల్‌ తాజాగా ఆదివారం ఎలిమినేట్‌ అయ్యాడు. డేనియల్‌ ఎలిమినేట్‌ అయ్యి ఇంటికి వచ్చిన తెల్లారే తన ప్రేయసి డెనీషాను పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గత కొంత కాలంగా డేనియల్‌ మరియు డెనీషాలు ప్రేమలో ఉన్నారు. డేనియల్‌ బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలోనే డెనీషాకు వివాహం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రయత్నించారని, దాంతో బిగ్‌బాస్‌ ఇంటికి వచ్చి మరీ ఒకసారి డేనియల్‌ను ఆమె కలిసినట్లుగా ప్రచారం జరిగింది.

Bigg Boss Tamil 2 Fame Danny Annie Pop Gets Married!-

Bigg Boss Tamil 2 Fame Danny Annie Pop Gets Married!

తాజాగా డేనియల్‌ను ఎలిమినేట్‌ చేసినట్లుగా కమల్‌ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లిని కేవలం సన్నిహితుల సమక్షంలో మాత్రమే చేసుకున్నట్లుగా డేనియల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. రిజిస్ట్రర్‌ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్న డేనియల్‌ కొన్ని కారణాల వల్ల హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, నా ప్రేయసి ఇప్పుడు నా భార్య అయ్యింది అంటూ పోస్ట్‌ చేశాడు.

డేనియల్‌ పెళ్లి కోసమే ఫైనల్‌ వరకు ఉండకుండా వచ్చాడు అంటూ టాక్‌ కూడా వినిపిస్తుంది. గత వారం డేనియల్‌కు మంచి ఓట్లే వచ్చాయి. కాని ప్రేమ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న కారణంగా బిగ్‌బాస్‌ నిర్వాహకులు అతడి కోరిక మేరకు బయటకు పంపించినట్లుగా ప్రచారం జరుగుతుంది.