కత్తి మహేష్‌ను ఫాలో అవుతున్న బిగ్‌బాస్‌ గణేష్‌....  

Big Boss Telugu 2 Ganesh Following Kathi Mahesh-

తెలుగు బిగ్‌ బాస్‌ మొదటి సీజన్‌ కు ముందు కత్తి మహేష్‌ గురించి ఏ ఒక్కరికి పెద్దగా తెలియదు. సినిమా పరిశ్రమలో వారికి మాత్రమే కొందరికి కత్తి మహేష్‌ గురించి తెలుసు. కాని బిగ్‌ బాస్‌ తర్వాత మంచి గుర్తింపు దక్కింది...

కత్తి మహేష్‌ను ఫాలో అవుతున్న బిగ్‌బాస్‌ గణేష్‌....-Big Boss Telugu 2 Ganesh Following Kathi Mahesh

ఆ గుర్తింపు చాలదు అన్నట్లుగా కావాలని పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేసి, ఆయన ఫ్యాన్స్‌తో ట్రోల్‌ చేయించుకుని మీడియాలో కనిపించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ దక్కించుకున్నాడు. ఆ పబ్లిసిటీతో కత్తి మహేష్‌ భారీ ఎత్తున లాభం చేకూరింది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆయన్ను ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు కత్తి మహేష్‌ దారిలోనే గణేష్‌ కూడా సాగాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

బిగ్‌ బాస్‌ రెండవ సీజన్‌ లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన గణేష్‌ అనూహ్యంగా 12 వారాల పాటు ఇంట్లో కొనసాగాడు. గణేష్‌కు మంచి గుర్తింపు దక్కింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న గణేష్‌ తనకు వచ్చిన గుర్తింపును ఇంకాస్త పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అందుకోసం ఈయన కౌశల్‌ను టార్గెట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం కౌశల్‌కు సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్‌ పై ఎవరైనా చిన్న కామెంట్‌ చేసినా వారిపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ పడుతున్నాయి...

గణేష్‌ ఎలిమినేట్‌ అయిన తర్వాత కొన్ని రోజులు కామ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కౌశల్‌ అభిమానులను చూసి షాక్‌ అయ్యాను అంటూ మాట్లాడాడు. కాని ఇప్పుడు మాత్రం కౌశల్‌కు అభిమానులు ఏర్పడటం చాలా కామన్‌ అని, ప్రతి ఇంటి సభ్యుడికి కూడా ఆర్మీ ఉందని, అందరికి అభిమానులు ఉన్నారు అంటూ చెబుతున్నాడు.

కౌశల్‌ ఆర్మీ గురించి ఎక్కువ పబ్లిసిటీ అక్కర్లేదు అంటూ గణేష్‌ చెప్పాడు. దాంతో గణేష్‌ను కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తున్నారు.

కౌశల్‌ ఆర్మీ గురించి గణేష్‌కు తెలియనిది కాదు. స్టార్స్‌ సైతం కౌశల్‌ ఆర్మీ గురించి షాక్‌ అవుతున్నారు.

అలాంటిది కౌశల్‌ గురించి తప్పుగా మాట్లాడితే విమర్శలు వస్తాయి, తద్వారా పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశ్యంతోనే గణేష్‌ ఇలా చేశాడనే టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం గణేష్‌ సినిమాల్లో కమెడియన్‌ పాత్రలకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ఈ పబ్లిసిటీని వినియోగించుకోవాలని చూస్తున్నాడు...