ప్రేమించినోడి కళ్ళు పోయేసరికి పోకిరీలు మాకైనా నీ అందాన్ని చూపించమన్నారు..చివరికి.?  

Best Story Of A Husband And Wife-

He is a clerk in the karanaashop ... the hardest day of Rs 20 per day .... Since childhood he has packed grocery packages in the same shop. Very truthful. One day a young woman goes out of the shop and goes to the shop ... Meanwhile, this grocery shop is going to run for the boy ... and Madam put her in your hands as a balance sheet. Love at first site ... that gesture of the day ... turned into a wedding, got married in three months and caused a daughter to be born in a year!

Now that the three ladies in the family have grown up ... no salary is going to be any corner. He bought his farm from his father and bought his own grocery shop. All the villagers about his honesty started to go to his shop .. When he was trying to end their hardship ... his own brother's brother had a bad case that he was selling all the goods in the shop, and even earlier, shop owner Oran also paid some more money. The well-running shop shut down

But he did not lose his courage ... he took a family and went to the town where he was away from his hometown ... started running a rickshaw and hired him. The wife who understands the difficulty of the husband ... I also say that he will work in two to three houses ... but the husband does not accept me..I am struggling with it! You are a very sensitive wife who refuses to offer me a sin .

On a night of 9pm he was drowning in a rickshaw and hit him with a strong blow and lost his face forever. Nothing is impossible for him ... his days are running .. life is hard. In this order, the wife laid his shoulders on the shoulders ... working 4-5 days of the day with the money that he started with the husband and the child began to play .. You look so beautiful, your husband can not see your beauty .. ..Porboro's straightforward words. The gaze that looks like mingazela..but the day she goes over her work ... with patience and courage.

అత‌డో కిరాణాషాప్ లో గుమ‌స్తా…రోజంతా క‌ష్ట‌ప‌డితే అత‌డికొచ్చేది 20 రూపాయ‌లు….చిన్న‌ప్ప‌టి నుండి అత‌డు అదే షాప్ లో కిరాణా సామాన్ల‌ను ప్యాక్ చేస్తూ పెరిగాడు. చాలా నిజాయితి ప‌రుడు. ఓ రోజు ఓ యువ‌తి ఆ షాప్ నుండి ఎగ్స్ తీసుకొని వెళుతుంది…ఇంత‌లో ఈ కిరాణా షాప్ కుర్రాడు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి…, మేడ‌మ్ మీ బ్యాలెన్స్ డ‌బ్బులు అని ఆమె చేతిలో పెట్టాడు. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అన్న‌ట్టు…ఆ రోజు క‌లిసిన ఆ చూపులు…నెలలోపే పెళ్ళిచూపులుగా మారి, మూడు నెలల్లో పెళ్లి పీట‌ల‌కు చేరి, ఏడాదిలోపు వారికి ఓ కూతురు పుట్టడానికి కార‌ణ‌మ‌య్యాయి.!.

ప్రేమించినోడి కళ్ళు పోయేసరికి పోకిరీలు మాకైనా నీ అందాన్ని చూపించమన్నారు..చివరికి.?-Best Story Of A Husband And Wife

ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ముగ్గురు.

ఖ‌ర్చులు పెరిగాయ్… వ‌చ్చే జీతం ఏ మూల‌కు చాల‌ట్లేదు.దీంతో అత‌డు తండ్రి నుండి త‌న వాటాగా వ‌చ్చిన పొలాన్ని అమ్మి ఆ డ‌బ్బుల‌తో సొంతంగా కిరాణా షాప్ పెట్టుకున్నాడు. అత‌డి నిజాయితీ గురించి తెల్సిన గ్రామ‌స్తులంద‌రూ అత‌డి షాప్ కే వెళ్ల‌డం ప్రారంభించారు..

త‌మ క‌ష్టాలు తీరాయి అనుకుంటున్న త‌రుణంలో…సొంత అన్న‌పైనే క‌న్ను కుట్టిన త‌మ్ముడు ఆ షాప్ లో అన్నీ కల్తీ స‌రుకులే అమ్ముతున్నాడ‌ని త‌ప్పుడు కేసు బ‌నాయించాడు, ఇంత‌కు ముందు అన్న ప‌నిచేసిన‌ షాప్ ఓన‌ర్ కూడా కొన్ని డ‌బ్బులిచ్చి కేసును మ‌రింత గ‌ట్టిగా రాయించాడు. దీంతో బాగా న‌డుస్తున్న షాప్ మూత‌ప‌డింది.

అయినా ఏ మాత్రం ధైర్యం కోల్పోని అత‌ను…ఫ్యామిలీని తీసుకొని సొంత ఊరికి దూరంగా ఉన్న టౌన్ కు వెళ్లాడు …ఓ రిక్షాను కిరాయికి తీసుకొని న‌డ‌ప‌డం స్టార్ట్ చేశాడు.ఉద‌యం 5 కు స్టార్ట్ చేస్తే….రాత్రి 9 వ‌ర‌కు రిక్షా తొక్కేవాడు. భ‌ర్త క‌ష్టాన్ని అర్థం చేసుకున్న భార్య‌…నేను కూడా రెండు మూడు ఇండ్ల‌లో పాచి ప‌నిచేస్తాన‌ని చెబుతుంది…కానీ భ‌ర్త అందుకు ఒప్పుకోడు.నేను క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాను క‌దా.! నువ్వు పాప‌ను , న‌న్ను చూసుకో చాలు అని చాలా సున్నితంగా భార్య ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తాడు.

ఓ రోజు రాత్రి 9 గంట‌లకు రిక్షాపై ఇంటికొస్తున్న అత‌నిని ఓ లారీ ఢీ కొట్టింది, దీంతో అత‌ని త‌ల‌కు బ‌ల‌మైన దెబ్బ త‌గిలి శాశ్వ‌తంగా చూపును కోల్పోయాడు. ఏమీ చేయ‌లేని నిస్సాహ‌య‌త అత‌నిది… రోజులు గ‌డుస్తున్నాయ్.జీవ‌నం క‌ష్ట‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలో కుటుంబ బాధ్య‌త‌ను భార్య త‌న భుజాల‌పై వేసుకుంది…రోజు 4-5 ఇండ్ల‌లో ప‌నిచేస్తూ ఆ వ‌చ్చిన డ‌బ్బుతో భ‌ర్త‌ను, పాప‌ను పోషించ‌డం ప్రారంభించింది.

నిన్ను చూస్తే ఇంత అందంగా ఉన్నాడు, నీ భ‌ర్త‌కేమో నీ అందాన్ని చూసే అవ‌కాశం లేదు.మాకైనా చూపించొచ్చు క‌దా నీ అందాలు అంటూ….పోరంబోకుల సూటిపోటి మాట‌లు. మింగేసేలా చూసే ఆ చూపులు.రోజూ వాటిని దాటుకుంటూనే ఆమె త‌న ప‌నికి వెళుతుండేది…. స‌హ‌నాన్ని, ధైర్యాన్ని తోడుతీసుకొని.!.

నీ భ‌ర్త‌కు కండ్లు క‌నిపించ‌వు క‌దా…ఆ రైల్వే స్టేష‌న్ కు వెళ్లి అడుక్కుంటే నీకు కాస్త హెల్ప్ గా కూడా ఉంటుంది క‌దా.అని అపాటికే చాలా మంది ఉచిత స‌ల‌హాల‌నేకం ఇచ్చారు.

భర్త కూడా భార్య‌తో…అడుక్కుంటే త‌ప్పేంటి. మ‌నం నిస్సాహ‌య స్థితిలో ఉన్నాం క‌దా.అని రేప‌టి నుండి బిక్షాట‌న‌కు వెళ‌తాన‌ని అంటాడు…భార్య దానికి అంగీక‌రించ‌దు. నా రెక్కాడిన‌న్ని రోజులు మ‌నం ఎవ్వ‌రి ముందు చేయిచాచ‌కుండా క‌ష్ట‌ప‌డ‌తాను.అవ‌స‌ర‌మైతే ఇంకా రెండిళ్లు మాట్లాడుకుంటాన‌ని చెప్పి భ‌ర్త ప్ర‌య‌త్నాన్ని విరమించేలా చేస్తుంది.

ఓ రోజు….భార్య వ‌చ్చే స‌మ‌యానికి భ‌ర్త‌…త‌న కూతురి స‌హాయంతో ఓ సంచిలోని చిల్ల‌ర‌ను లెక్కిస్తుంటాడు…. రాగానే భార్య ఏంటండీ ఈ ప‌ని.? ఎవరో చెప్పిన మాట‌లు విని, మీ ఆత్మ గౌర‌వాన్ని చంపుకొని చేయి చాచి అడుక్కున్నారా.

? ఈ పాపిష్టి సొమ్ము మ‌న‌కొద్ద‌ని గ‌ట్టిగా ఏడుస్తుంది. ఇది గ‌మ‌నించిన అత‌ను…. మేడ‌మ్ కాస్త ఆగండి…ఇవి నేను ఈ రోజు రైల్వే స్టేష‌న్ లో పేప‌ర్ అమ్మి సంపాదించిన సొమ్ము…పాపిష్టిది కాదు…క‌ష్టానిది.! అన‌డంతో త‌న్మ‌యంతో భ‌ర్త‌ను కౌగిలించుకుంటుంది భార్య‌…క‌ళ్లు లేన‌ప్ప‌టికీ భార్య క‌ళ్ళ‌ల్లోని ఆనందాన్ని చూడ‌గ‌లిగాడు భ‌ర్త‌.!