అలా చేస్తే నా అభిమానులే నా పై కేసులు పెడతారేమో : బాలయ్య  

Balakrishna Opens About Playing Villain Role-

నందమూరి బాలకృష్ణ ఇటీవల సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా రానాతో కలిసి బాలయ్య బాబు ఈ వేడుకలకు హాజరు అయ్యాడు. ఈ వేడుకల్లో బాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు...

అలా చేస్తే నా అభిమానులే నా పై కేసులు పెడతారేమో : బాలయ్య-Balakrishna Opens About Playing Villain Role

ఇక బాలయ్య మరియు రానాలు రెడ్‌ కార్పెట్‌ వాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాంకర్‌ వీరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సమయంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘బాహుబలి’ చిత్రంలో రానా విలన్‌గా చాలా బాగా నటించాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మంచి పాత్ర వస్తే నాకు విలన్‌గా నటించాలని ఉంది అంటూ బాలయ్య పేర్కొన్నాడు.

నేను విలన్‌గా నటిస్తే నా అభిమానులే నాపై పోలీస్‌ కేసులు పెడతారేమో అంటూ బాలయ్య నవ్వుతూ కామెంట్స్‌ చేశాడు. నేను విలన్‌గా కనిపించడం వారికి ఇష్టం లేదు. నాకు ఆ ఆలోచన వచ్చినా కూడా వారు కోప్పడతారు అంటున్నాడు.

భల్లాలదేవుడు వంటి పాత్రను చేయడం అంటే రానాకే చెల్లింది. అలాంటి పాత్ర తనకు వస్తే తప్పకుండా అంగీకరించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బాలయ్య హీరోగా మెల్ల మెల్లగా ఫేడ్‌ ఔట్‌ అవుతున్న కారణంగా విలన్‌ పాత్రు చేయడం మంచిది అంటూ ఈమద్య కొందరు సోషల్‌ మీడియాలో వాఖ్యలు చేశారు...

తాను విలన్‌ పాత్రలో నటిస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు అంటున్న బాలయ్య నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరో పాత్రను చేసేందుకు కూడా ఆసక్తి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మంచి నటుడిగా నిరూపించుకోవాలి అంటే నెగటివ్‌ షేడ్స్‌తో అయితేనే సాధ్యం అవుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న విషయం తెల్సిందే.

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో బాలకృష్ణతో పాటు రానా కూడా నటిస్తున్నాడు...

చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లుక్‌ ఇప్పటికే రివీల్‌ అయ్యింది. రానా మరియు బాలకృష్ణలు ఎన్టీఆర్‌ మరియు చంద్రబాబు నాయుడుగా అద్బుతంగా ఉన్నారు అంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.