వర్షాలకోసం టైర్లు ఉప్పు కాల్చండి అంటూ కలెక్టర్ ఆదేశం..సర్వత్రా ఆగ్రహం..  

Babu Brainwave: Burn Tyres, Twigs, Salt For Rain-

వర్షాలు పడకపోతే ఊర్లల్లో ఏం చేస్తారు.కప్పలకు పెళ్లిల్లు చేస్తారు...

వర్షాలకోసం టైర్లు ఉప్పు కాల్చండి అంటూ కలెక్టర్ ఆదేశం..సర్వత్రా ఆగ్రహం..-Babu Brainwave: Burn Tyres, Twigs, Salt For Rain

మరికొందరు పెనం కి నూనె రాసి పసుపు కుంకుమలు పెట్టి వానదేవుడా రా అంటూ మొక్కుతారు.ఈ పనులకు వర్షాలు పడతాయో లేదో తర్వాత విషయం.ఇలాంటి మూఢనమ్మకాలు ఎన్నో వుణ్నాయి కాబట్టి మామూలు ప్రజలు పాటించినా మేధావులు కొట్టిపారేస్తారు.కానీ చదువుకుని ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా వర్షాల కోసం వింతపద్దతులు పాటిస్తే ఏమంటారూ.సాక్ష్యాత్తూ జిల్లా కలెక్టరే ఇలాంటి పని చేస్తే…ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరూ.ఏం చేశారు.చదవండి.

సోలాపూర్ కలెక్టర్ రాజేంద్ర భోసలే వర్షాలు పడడం కోసం కొత్త విధానాన్ని చెప్పుకొచ్చాడు.అంతే కాదు ఇది పాటించాలని అధికారులను ఆదేశించాడు.కలెక్టర్ చెప్పిన విధానం ఏంటంటే కార్లు, బస్సుల టైర్లు, ఉప్పును ఒకేసారి కాల్చడం ద్వారా వర్షాలు పడతాయని, దాన్ని అందరూ ఆచరణలో పెట్టాలని చెప్పాడు.

కలెక్టర్ ఆదేశించాడు కాబట్టి చచ్చినట్టు ఆయన చెప్పింది చెయ్యాల్సిందే… లేదంటే ఉద్యోగాలు ఉండవు అని అనకున్నారేమో.కలెక్టర్ చెప్పిన పనికి నవ్వుకుంటో,కోపంతోనో జిల్లాలోని అధికారులందరూ 11 మండలాల్లో 1,026 చోట్ల టైర్లు, ఉప్పును కలిపి కాల్చడం మొదలుపెట్టారు. చిటపటలాడుతూ మండే ఉప్పు సెగ ఆ నోటా, ఈ నోటా మీడియాకు చేరింది. దీంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది..

ఇదే విషయంపై కలెక్టర్ ని ప్రశ్నిస్తే తాను చేసింది కరెక్టే అని అందరూ ఇదే చేయాలంటూ తనని తాను సమర్ధించుకున్నాడు.

ఇంకేం చెప్పాడంటే ‘ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి రాజా మరాఠే దీన్ని ప్రతిపాదించారు. ఇలా రెండు టైర్లు, కొన్ని కట్టెలు, 50 కేజీల ఉప్పును కలిపి కాల్చడం వల్ల ఉప్పు నీరు ఆవిరిగా మారి గాల్లో కలిసిపోయి 24-96 గంటల వ్యవధిలో వర్షాలు సంభవిస్తాయని మరాఠే నాకు చెప్పారు. 3-4 మిమీ వర్షం కురుస్తుంది. 500 ట్యాంకర్లలో పట్టే ఈ నీటిని బయట కొనాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుంది, కానీ నా విధానంలో ఖర్చు రూ.500కు మించదు.ఈసారి జిల్లాలో కేవలం 35 శాతం వర్షపాతం మాత్రమే నమోదైన కారణంగా కృత్రిమ వర్షపాతం కోసం ఈ విధానాన్ని పాటించాము’ అని వివరణ ఇచ్చుకున్నారు సదరు కలెక్టర్.

అయితే కలెక్టర్ వివరణను వ్యతిరేకిస్తున్నారు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు. రబ్బరు టైర్లను, ఉప్పును కలిపి కాల్చడం వల్ల వర్షాలు రావనీ, ఇది అశాస్త్రీయమైన నమ్మకమని కొట్టిపడేశారు.

టైర్లను కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు గాల్లోకి విడుదల అవుతాయన్నారు. కలెక్టర్ ఆదేశాలపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదువుకునే కలెక్టరయ్యాడా అంటూ విమర్శిస్తున్నారు...

దీంతో తన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.