వేళ్లు చూపిస్తూ సెల్ఫీ దిగుతున్నారా..అది ఎంత ప్రమాదమో తెలిసా?  

Are Peace Sign Selfies Putting You In Danger-

ఈ రోజుల్లో సెల్ఫోన్ లేనివాడు,సెల్ఫీ అంటే తెలియని వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదుఏ చిన్న అకేషన్ అయినా,ఏ ఇద్దరు కలిసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెల్ఫీకేసరే మీరు ఎలా అయినా దిగండి,ఎవరితో అయినా దిగండికానీ వేళ్లు మాత్రం చూపెడుతూ ఫోటో దిగకండిఅదేనండి కొందరు v సింబల్లో రెండు వేళ్లను కెమెరాకు చూపెడుతూ ఫోటో దిగుతుంటారు అలా దిగకండి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలుమా సెల్ఫీ మా ఇష్టం అంటారాఅయితే ఇది చదవండి

Are Peace Sign Selfies Putting You In Danger-

Are Peace Sign Selfies Putting You In Danger

బయోమెట్రిక్‌ వచ్చాక దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు చాలామంది.బయోమెట్రిక్ ద్వారా పాస్‌వర్డ్‌లు సులభంగా పెడుతున్నారని, ఇది సైబర్‌ నేరగాళ్లకు ఒక రకంగా వరంగా మారిందని ఐబీఎం సెక్యూరిటీ నిర్వహించిన ఫ్యూచర్‌ ఐడెంటిటీ స్టడీలో వెల్లడైంది. 75 శాతం మంది యువత బయోమెట్రిక్‌ (వేలిముద్ర పాస్‌వర్డ్‌)కు మొగ్గుచూపుతున్నారని ఈ సర్వే తెలిపింది. 50 శాతం కంటే తక్కువ మందే కఠినంగా పాస్‌వర్డ్‌లు క్రియేట్‌ చేస్తున్నారని తేల్చారు. మూడు మీటర్ల లోపు దూరం నుంచి మంచి కాంతిలో, స్పష్టంగా తీసిన ఫొటోలలోని చేతి వేళ్లను హ్యాకర్లు సులభంగా కాపీ చేయగలరని జపాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ పరిశోధకులు కనుగొన్నారు.

Are Peace Sign Selfies Putting You In Danger-

చేతి వేళ్లు చూపిస్తూ దిగిన సెల్ఫీ నుంచి వేలి ముద్రలను హ్యకర్లు కాపీ చేయగలరని సైబర్‌ క్రైమ్‌ నిపుణులు అంటున్నారు. ఈ పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చేతి వేళ్ల కొనలు ఫొటోల్లో కనిపించకుండా చేసే పారదర్శకమయిన టైటానియమ్‌ ఆక్సైడ్‌ ఫిల్మ్‌ను జపాన్‌ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కానీ, చేతి వేళ్లు ఫొటోల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు .బొటన వేలును చూపిస్తూ డన్‌ అనే సంకేతంతో మరికొందరు బొటన వేలును చూపిస్తూ డన్‌ అనే సంకేతంతో ఫొటోలు దిగుతుంటాం. ఇలా ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేయటం కూడా తప్పే కాదు ఎంతో ప్రమాదం కూడా. వాటికి నకిలీలు సృష్టించి సృష్టించి బ్యాంక్‌ ఖాతా తెరిచి కొల్లగొట్టవచ్చునట. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌లోడు అవుతున్న ఫోటో వేలి ముద్రతో అదే మాదిరిలో నకిలీని సృష్టించి బ్యాంక్‌ ఖాతా తెరిచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని అంటున్నారుకాబట్టి తస్మాత్ జాగ్రత్త