షూటింగ్ స్పాట్ నుండి హీరోయిన్ జంప్..! ఎందుకో తెలుసా.? ఇంతకీ ఎవరా హీరోయిన్.?  

Anupama Prakash Runs Away From The Shooting Spot-

సీరియస్ గా షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్ వచ్చింది. కాసేపటికి...

షూటింగ్ స్పాట్ నుండి హీరోయిన్ జంప్..! ఎందుకో తెలుసా.? ఇంతకీ ఎవరా హీరోయిన్.?-Anupama Prakash Runs Away From The Shooting Spot

షూటింగ్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ కోసం అడిగితే.

చూడలేదన్నారు. కాసేపటికి నిర్మాతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా హీరోయిన్ మిస్ అయ్యిందన్న వార్తతో పోలీసు స్టేషన్ కుపరుగులు పెట్టిన పరిస్థితి కోలీవుడ్ లో చోటుచేసుకుంది.

సంచలనం సృష్టించిన ఈ సంఘటన కొడైకెనాల్ లో జరిగింది . ఇంతకీ షూటింగ్ నుండి పారిపోయిన హీరోయిన్ ఎవరో తెలుసా ……. అనుపమా ప్రకాష్ . అవళుక్కెన్న అళగియ ముగం పేరుతో తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో నటిస్తోంది అనుపమా ప్రకాష్ .

హీరోయిన్ అనుపమ ప్రకాష్ విరామం మధ్యలో తన రూముకు వెళ్లింది. మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే సమయానికి కనిపించకుండా పోయింది.

దీంతో కంగారు పడ్డ యూనిట్ సభ్యులు ఆరా తీయగా తన స్వస్థలం ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. నిర్మాత స్వయంగా వెళ్లి విషయం అడగ్గా ఎత్తైన కొండల నడుమ డాన్స్ చేయడంతో భయంగా అనిపించిందని అందుకే వచ్చేసానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాటను కంప్లీట్ చేసే నిమిత్తంగా మళ్లీ ఆమెను తీసుకువచ్చి మిగిలిన భాగాన్ని చిత్రీకరించారు చిత్ర యూనిట్...