ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా.! శివాజీ మాటలా వెనుక మర్మం ఏంటి ..!  

  • తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫరేషన్ గరుడ ఏపీ సీఎం చంద్రబాబు కి అందిన కోర్టు నోటీసుల అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి సినీనటుడు శివాజీ పూటకో ప్రకటన చేస్తూ మరింత కాక రేపుతున్నాడు. అసలు చంద్రబాబు కి మొన్న సోమవారమే నోటీసుల అందబోతున్నట్టు ప్రకటించిన శివాజీ మరిన్ని నోటీసులు బాబు కి అందబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

  • Andhra Pradesh To Be Under President's Rule-

    Andhra Pradesh To Be Under President's Rule

  • అయితే సినీనటుడు శివాజీ ఇలా లీకులు మీద లీకులు ఇస్తుండడం పై వైఎస్సార్ సీపీ స్పందించడంపై శివాజీ మాట్లాడుతూ శివాజీ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేశారని, జగన్‌కు ఏమన్నా పని ఉందా అని శివాజీ మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా అని ప్రశ్నించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని అందరూ కలిసి చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసులు పెడతారు ఆయన లోపలకు వెళ్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు చీలిపోతారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వస్తుంది. ఆ తరువాత ఎన్నికలు వస్తాయి ఇదేనా మీకు కావాల్సిన రాజకీయం అని ప్రశ్నించారు.

  • Andhra Pradesh To Be Under President's Rule-
  • చంద్రబాబు ను ఏదోలా అధికారానికి దూరం చేసి జగన్ ఆ కుర్చీలో కూర్చోవాలని కలలుకంటున్నాడని శివాజీ ఆరోపించారు. దేశంలో మోదీకి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని శివాజీ వ్యాఖ్యానించారు. తాను గత మూడు రోజుల నుంచి లాయర్లతో మాట్లాడానని, ఈ నోటీసులకు సంబంధించిన పరిణామాల గురించి తెలుసుకున్నానని శివాజీ చెప్పారు. మరికొన్ని నోటీసులు కూడా మీ కోసం సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఆ నోటీసుల గురించి తాను బయటకు చెప్పలేనని ఆయన చెప్పాడు. అయితే శివాజీ మాటలను బట్టి చూస్తుంటే ఏపీలో రాష్ట్రపతి పాలన రావాలని నిజంగా వైసీపీ కోరుకుంటుందా ? ఒకవేళ అలా వస్తే వైసీపీ నిజంగా లాభపడుతుందా అనేది ఆ పార్టీ నేతలకే తెలియాలి.