నన్ను నమ్మినందుకు వారి రుణం తీర్చుకుంటానంటున్న అల్లరోడు  

  • అల్లరి నరేష్‌ ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్దం అయ్యాడు. హీరోగా నటిస్తున్న చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్న కారణంగా చేసేది లేక హీరోగానే చేయాలనే పట్టుదలను ఈయన వదిలేసినట్లుగా సమాచారం అందుతుంది. గతంలోనే రెండు మూడు చిత్రాల్లో ముఖ్య పాత్రలను పోషించిన అల్లరి నరేష్‌ తాజాగా మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’లో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది.

  • Allari Naresh About His Role In Mahesh Babu Maharshi Movie-

    Allari Naresh About His Role In Mahesh Babu Maharshi Movie

  • తాజాగా అల్లరి నరేష్‌ నటించిన ‘సిల్లీఫెలోస్‌’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు మహర్షి చిత్రంలో ఛాన్స్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూతురు పుట్టిన తర్వాత వచ్చిన మొదటి ఆఫర్‌ ఇది. అందుకే మహేష్‌ మూవీ నాకు చాలా ప్రత్యేకంగా భావిస్తాను. మహర్షితో నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ దక్కుతుందని నమ్మకంగా ఉన్నాను అంటూ అల్లరి నరేష్‌ చెప్పుకొచ్చాడు.

  • Allari Naresh About His Role In Mahesh Babu Maharshi Movie-
  • నాకు ఈ పాత్రను ఆఫర్‌ చేసింది దర్శకుడు వంశీ పైడిపల్లి కాదని, మహేష్‌ నేను ఆ పాత్రకు అయితే సూట్‌ అవుతాను అంటూ చెప్పడం వల్లే వంశీ నన్ను సంప్రదించాడు అంటూ చెప్పుకొచ్చాడు. 2016లోనే ఈ చిత్రం ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఒక మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, పూర్తి స్థాయి పాత్రలో తాను కనిపించబోతున్నాను అని, సినిమా కోసం 150 రోజుల పాటు వర్క్‌ చేస్తున్నాను.

  • సినిమా మొదటి నుండి చివరి వరకు నేను ఉంటాను. ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు మహేష్‌బాబుకు రుణపడి ఉంటాను, తప్పకుండా వారి నమ్మకం నిలబెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అల్లరి నరేష్‌ నటిస్తున్న సిల్లీఫెలోస్‌ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సునీల్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.