ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఆలియా ఎంత తీసుకుంటుందో తెలుసా... జక్కన్న మూవీ అంటే ఇంతే మరి  

Alia Bhatt Remuneration For Rajamouli Rrr Movie-jr Ntr,rajamouli,ram Charan

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పారితోషికం భారీగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ సైతం రెండు కోట్ల పారితోషికం తీసుకుంటే వామ్మో అంటారు. అయితే బాలీవుడ్‌లో హీరోయిన్స్‌ మాత్రం ఏకంగా 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మలను సౌత్‌కు తీసుకు వచ్చిన సమయంలో వారికి ఆ స్థాయిలోనే పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌ మల్టీస్టారర్‌ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఆలియా భట్‌ ఎంపిక అయ్యింది. ఆ చిత్రంకు గాను ఆలియా భట్‌ ఏకంగా 13 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Alia Bhatt Remuneration For Rajamouli RRR Movie-Jr Ntr Rajamouli Ram Charan

Alia Bhatt Remuneration For Rajamouli RRR Movie

ఆలియా భట్‌ బాలీవుడ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కోసం ఆలియా ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉండటంతో పాటు, ఎక్కువగా కష్టపడాల్సి ఉన్న కారణంగా 13 కోట్ల పారితోషికంను స్వయంగా జక్కన్న ఆఫర్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. రామ్‌ చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ తప్పకుండా మంచి ఆకర్షణగా నిలుస్తుందని, ఈ చిత్రంతో ఆలియా సౌత్‌లో మంచి స్టార్‌డంను దక్కించుకుంటుందనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Alia Bhatt Remuneration For Rajamouli RRR Movie-Jr Ntr Rajamouli Ram Charan

అల్లూరి రామరాజు మరదలు సీత పాత్రలో ఆలియా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి అడిగిన వెంటనే ఆమె ఓకే చెప్పిందట. బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా ఉన్న ఆలియా భట్‌ మరే దర్శకుడు అడిగినా కూడా ఇంత పారితోషికం ఇస్తామన్నా కూడా ఒప్పుకునేది కాదేమో. కాని రాజమౌళి స్థాయి బాహుబలిని దాటేసి పోయింది. అందుకే ఆయన అడిగిన వెంటనే పారితోషికం విషయం కూడా పట్టించుకోకుండా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాజమౌళి అడిగితే ఇండియాలో ఏ నటుడు అయినా నటి అయినా కాదనేంత ధైర్యం చేయరు. ఎంత పెద్ద ప్రాజెక్ట్‌ చేస్తున్నా కూడా ఖచ్చితంగా జక్కన్న మూవీలో నటించేందుకు ఆసక్తి చూపుతారని మరోసారి నిరూపితం అయ్యింది.