ఇదేం ట్విస్ట్‌ నాగ్‌... రెండు ఒకేసారి ఎలా?  

Akkineni Nagarjuna Sequel Movie Going To Start Soon-akkineni Nagarjuna,akkineni Samantha,bangarraju Movie,manmadudu 2,nagarjuna Next Movie

నాగార్జున వయసు మీద పడుతున్న నేపథ్యంలో సినిమాల సంఖ్య కాస్త తగ్గిస్తున్నాడు. మునుపటితో పోల్చితే నాగార్జున సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈయన గత కొన్ని నెలలుగా సినిమాలు ఏమీ లేకుండానే ఉన్నాడు. నానితో కలిసి దేవదాసు మరియు వర్మ దర్శకత్వంలో ఆఫీసర్‌ చేశాడు. ఆ రెండు చిత్రాల తర్వాత నాగార్జున సినిమా ఏది ఇప్పటి వరకు మొదలు కాలేదు. మన్మధుడు 2 అని కొన్ని రోజులు బంగార్రాజు అంటూ మరి కొన్ని రోజులు రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు మన్మధుడు 2 చిత్రం ప్రారంభం కాబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.

Akkineni Nagarjuna Sequel Movie Going To Start Soon-Akkineni Akkineni Samantha Bangarraju Manmadudu 2 Next

Akkineni Nagarjuna Sequel Movie Going To Start Soon

నాగార్జున నిర్మాణంలో రాహుల్‌ రవీంద్రన్‌ మన్మధుడు 2 చిత్రం ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సమయంలోనే నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రంలో కూడా నటించబోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది. మన్మధుడు 2 ప్రారంభం అయిన నెల రోజుల్లోనే బంగార్రాజును సెట్స్‌పైకి తీసుకు వెళ్లేందుకు దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఏర్పాట్లు చేస్తున్నాడు. పెద్ద ఎత్తున బంగార్రాజును నిర్మించేందుకు నాగార్జున ప్లాన్‌ చేస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ, ఆ రెండు సినిమాలను నాగార్జున నిర్మించడం అంటే చాలా పెద్ద ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Akkineni Nagarjuna Sequel Movie Going To Start Soon-Akkineni Akkineni Samantha Bangarraju Manmadudu 2 Next

చాలా కాలంగా అనుకుంటున్న ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా నాగార్జున కెరీర్‌ను డిసైడ్‌ చేసే సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నాగార్జున సినీ కెరీర్‌ హీరోగా ముందుకు వెళ్లాలి అంటే ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా సక్సెస్‌ అవ్వాలి. ఒక వేళ ఈ సినిమాల ఫలితాలు తారు మారు అయితే మాత్రం నాగార్జున ఇక క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెటిల్‌ అవ్వాల్సిందే అంటూ కొందరు సలహా ఇస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్‌ అయినా నాగార్జున మరో అయిదు ఆరు సంవత్సరాలు హీరోగా దుమ్ము లేపేయడం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.