తెలుగు వారి మనసు దోచుకున్న 10 మంది పంజాబీ ముద్దుగుమ్మలు వీరే.! కొందరు పంజాబీ అంటే అస్సలు నమ్మలేము.!  

 • మన తెలుగు హీరోయిన్లు అంటూ ఓ తెగ గొప్పలు చెప్పేసుకుంటాం కానీఇప్పుడున్నోళ్లల్లో తెలుగు వాళ్లు ఎంతమందన్నది ప్రశ్నే అప్పట్లో లయ,తర్వాత చంటిగాడు ఫేం సుహాసిని,ఈ మధ్య అర కొర గా చిన్న చిన్న సినిమాల్లో నటించిన ఒకరిద్దరు మినహాఅందరూ చెన్నై భామలు,కేరళ కుట్టీలేఇప్పుడు వారిని కాదని పంజాభి ముద్దుగుమ్మలు కూడా మన తెలుగు పరిశ్రమలో తమ సత్తా చాటుతున్నారుమన దగ్గరి వాళ్లు కాకపోయినా మనది చాలా ఔన్నత్యం అందరిని ఓన్ చేసేసుకుంటాంసంధర్బం వచ్చినప్పుడు మన వారికి ఛాన్స్ ఇవ్వట్లేదని గగ్గోలు పెడతాం అది వేరే విషయం హీరోయిన్ల నటన అనేకంటే స్కిన్ షో కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి వారి నటన ఎలా ఉన్నా మెచ్చుకోలేకానీ నోరు తెరిస్తేనే వచ్చి రాని తెలుగుతో చంపేస్తారు దానికి ఛార్మీ లాంటి వారు కొందరు మినహాయింపు లెండితెలుగు నేర్చుకుని మరీ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.తెలుగు ఇండస్ట్రీలో హవా నడిపించిన నడిపిస్తున్న పంజాభీ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసు…

 • మెహరీన్ పిర్జాదా

 • క్రిష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో తెరంగేట్రం చేసిన మెహ్రీన్ ఇప్పుడు టాలివుడ్లో గోల్డెన్ లెగ్ అనే పేరు కొట్టేసిందిమహానుభావుడు,రాజా ది గ్రేట్ సినిమాలు హిట్ అవ్వడంఇప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయికేరాఫ్ సూర్య,జవాన్,సంగం వాటిల్లో కొన్ని.ఈ భామ పంజాబ్ లోని భటిండా ప్రాంతానికి చెందిన సిక్ ఫ్యామిలికి చెందిన అమ్మాయి.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-

  Actresses From Punjab Who Look Like Telugu Girls

 • సిమ్రాన్

 • 1997 లో అబ్బాయిగారి పెళ్లి సినిమాలో సుమన్ సరసన నటించిన సిమ్రాన్ పంజాబి ఫ్యామిలికి చెందినదే.కానీ ముంబాయిలో పుట్టి పెరిగింది.తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగింది.పెళ్లయ్యాక సినిమాలకు దూరమయినా క్రిష్ణ భగవాన్ తో జంటగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఆ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు.సినిమాలు చేయకపోయినా ఇప్పటికీ సిమ్రాన్ కి మన తెలుగు వాళ్లు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • తాప్సీ పన్ను

 • ఝుమ్మంది నాదం సినిమాతో ప్రారంభమయిన తాప్సీ సినీ ప్రయాణం మంచు వారి ఫ్యామిలీతో సత్సంభందాలే ఉన్నాయి.పంజాబీ కుటుంబానికి చెందిన తాప్సీ డిల్లీలో పుట్టి అక్కడే చదువుకుంది.తెలుగులో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత బాలివుడ్ వైపు వెళ్లిన ఈ భామ ,మళ్లీ ఇప్పుడు ఆనందో బ్రహ్మ సినిమాతో హిట్ కొట్టింది

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • రకుల్ ప్రీత్ సింగ్

 • ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో రకుల్ ఒకరు . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి ముందు కెరటం అనే సినిమాలో నటించింది రకుల్ ,కానీ అంతగా పేరు రాలేదు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత తిరిగి చూసుకోలేదు.వరుసగా అల్లు అర్జున్,చరన్,రవితేజ,మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోస్ అందరి సరసన ఛాన్స్ కొట్టేసిన రకుల్ ది పంజాబే.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • కాజల్ అగర్వాల్

 • అప్పుడెప్పుడో లక్ష్మీ కళ్యాణం సినిమాతో కెరీర్ ప్రారంభించిన కాజల్ పదేళ్లయినా స్టార్ హీరోయిన్ ప్లేస్ ని భద్రంగా కాపాడుకుంటుంది.తనతోపాటు కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది హీరోయిన్స్ ఎప్పుడో లైమ్ లైట్ లోకి వెళ్లిపోయారు.కాజల్ చెల్లి నిషా కూడా సినిమాల్లో నటించినప్పటికీ అక్కంత పేరు తెచ్చుకోలేదు,పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.కాజల్ మాత్రం ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ తో దూసుకుపోతుంది.ముంబయిలో సెటిల్ అయిన పంజాబీ కుటుంబానికి చెందింది కాజల్

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • ఛార్మీ కౌర్

 • నీతోడు కావాలి సినిమా ద్వారా పదమూడేళ్లకే ఇండస్ట్రీకి పరిచయమయిన ఛార్మీ పంజాబ్ ,సిక్ కుటుంబీకురాలు.ఇప్పుడు అటు హీరోయిన్ గా ఇటు పూరి జగన్నాద్ కి సంభందించిన నిర్మాణ సంభంద సంస్ద బాద్యతలు చూస్తుంది.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • భూమిక చావ్లా

 • యువకుడు సినిమా ద్వారా పరిచయం అయిన భూమిక ,పవన్ కళ్యాన్ సరసన నటించిన ఖుషీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకంది.తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది.ఈమె కూడా పంజాబ్ కుటుంబానికి చెందినదే కానీ బాల్యం ,విధ్యాభ్యాసం అంతా ఢిల్లీలో సాగింది.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • నవనీత్ కౌర్

 • ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శ్రీను వాసంతి లక్ష్మీ సినిమా నవనీత్ కౌర్ మొదటి సినిమా .ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన నవనీత్ కూడా పంజాబీ భామే

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • పూనమ్ బజ్వా

 • మొదటి సినిమాతో పరిచయమయిన పూనమ్ బజ్వా ది కూడా పంజాబే.ముంబాయిలో పెరిగిన పూనమ్ బజ్వా తెలుగులొ కొన్ని సినిమాలు చేసిందిఇప్పుడు నటనకు దూరంగా ఉంది.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-
 • నికితా

 • హాయ్ సినిమా ద్వారా పరిచయమయిన నికితా ది కూడా పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయే.

 • Actresses From Punjab Who Look Like Telugu Girls-