కూతురి నిశ్చితార్థంపై రష్మిక తల్లి ఏమన్నారంటే.? రక్షిత్ ఫేస్బుక్ లో అలా ఎందుకు పోస్ట్ చేసారు.?  

  • ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన ‘గీత గోవిందం’తో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం, రష్మిక అద్భుత నటనతో ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె వైపే చూస్తున్నారు. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో ఆమెకు బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇక రీల్ లైఫ్ సంగతటుంచి రియల్ లైఫ్ విషయానికొస్తే రష్మిక 2017లో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరుపుకుంది. అయితే ఈ నిశ్చితార్థం రద్దయిందని గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి.

  • Actress Rashmika About Her Daughter Engagement-

    Actress Rashmika About Her Daughter Engagement

  • కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో ఇంతకు ముందు వరకు ప్రేమలో మునిగితేలింది. అక్కడ ఈ జంట ఒక చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ పచ్చజెండా ఊపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. రష్మిక, రక్షిత్‌శెట్టి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అన్న తరుణంలో మనస్పర్థలు అనే మహమ్మారి తలపైకొచ్చి కూర్చుంది. అంతే నటి రష్మిక తనకు కాబోయే వరుడితో పెళ్లిని బ్రేకప్‌ చేసుకుంది. ఇది జరిగి కొద్ది రోజులైంది. అప్పుడు వీరి బ్రేకప్‌ వార్తను ఇద్దరూ ఖండించారు.

  • Actress Rashmika About Her Daughter Engagement-
  • కానీ ఇప్పుడు మరోసారి ఆ వార్త హల్‌చల్ చేస్తోంది. 22 ఏళ్ల రష్మిక ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి సారించిందని, అందుకే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని ఓ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. ఈ మేరకు రష్మిక సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ కెరీర్ కోసం ధైర్యం చేసిందట. తన తల్లిదండ్రులతో చర్చించి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందట. ఈ వార్తనైతే ఇప్పటి వరకు రష్మిక ఖండించలేదు.


  • తాజాగా రష్మిక నిశ్చితార్థం విషయమై ఆమె తల్లి సుమన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయిన విషయం నిజమే అని స్పష్టం చేసింది. ‘‘మేము చాలా డిస్టర్బ్‌ అయ్యాం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి జీవితం ఎంతో విలువైంది. ఎదుటి వ్యక్తి బాధపెడితే ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి’’ అని చెబుతూ ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయంపై రక్షిత్ శెట్టి కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు.