నెట్ లో వైరల్ అవుతున్న తారక్ తో ఈ ఫోటో తీయించుకున్న ఈమె ఎవరో తెలుసా? తల్లి కల కోసం ఆమె కొడుకు..!  

  • యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి చాలా ఆప్యాయంగా ఫోటో తీయించుకున్న ఈమె ఎవరో తెలుసా? ఒక హీరో తల్లి…తారక్ ను కలవాలి అన్నది ఆమె కోరిక. తల్లి కోరిక తీర్చడం కోసం తారక్ ఫోటో దిగే అవకాశం సంపాదించారు ఆ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా.? అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర. సినిమాలో నీకోసం చచ్చిపోతాను అని మిథున ని ప్రేమించి మనందరికీ కన్నీళ్లు తెప్పించిన నటుడు. ప్రస్తుతం “అరవింద సమేత” సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

  • Actor Naveen Happy Rhat NTR Posed With His Mother-

    Actor Naveen Happy Rhat NTR Posed With His Mother

  • ఈ సందర్భంగా నవీన్ తల్లితో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోకు ఫోజిచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నవీన్ చంద్ర. ‘‘నీవు కలగన్నదాన్ని సాధించుకోవడంలో సక్సెస్ ఉండదు. నా విషయంలో సక్సెస్ అంటే మా అమ్మ కలను నిజం చేయడమే. తారక్ గారిలోని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సింప్లిసిటీ, విధేయత. అమ్మా, నీ ఎగ్జైట్‌మెంటే నా బలం, ప్రేరణ. నీ ప్రతి కలను నెరవేర్చడాన్నే నా కలగా మార్చుక్చున్నా. థాంక్యూ తారక్, త్రివిక్రమ్ గారు’’ అంటూ పోస్ట్ పెట్టాడు.

  • Actor Naveen Happy Rhat NTR Posed With His Mother-
  • https://www.facebook.in/ItsNaveenChandra/posts/2162086877155528

  • ఇది ఇలా ఉండగా…”అరవింద సమేత” సినిమా ఈ వారం దసరా పండగకి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి!