ఏపీలోనూ 'ముందస్తు'.. జగన్ ప్రకటనతో సంచలనం  

 • ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ కు ఎన్నికల కంగారు బాగా ఎక్కువయినట్టు కనిపిస్తోంది. తెలంగాణాలో కేసీఆర్ అలా అయితే ముందస్తు ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడో సరిగ్గా అలాగే ఇప్పుడు జగన్ కూడా ఆ విషయంగానే కలవరిస్తున్నట్టు కనిపిస్తోంది.

 • ఏపీలోనూ 'ముందస్తు'.. జగన్ ప్రకటనతో సంచలనం -

 • విశాఖ పాదయాత్రలో ఉన్న జగన్ ఈ మేరకు ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేసి పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాడు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ – మే నెలలో జరుగుతాయి. కానీ ఈ సారి ఎన్నికలు ముందుగా అంటే జనవరిలోనే జరుగుతాయని దానికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని జగన్ పిలుపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

 • -

  నాలుగైదు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి కానీ.ఏపీలో ఎలా జరుగుతాయని. వాళ్లు తికమకపడ్డారు.

 • షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్, మే నెలలలో ఎన్నికలు జరుగుతాయి. ఎలా లేదన్నా ఏడెనిమిది నెలలు పడుతుంది.

 • జగన్ కు ఈ విషయం తెలియనిదేమీ కాదు. అయినా నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్‌ పిలుపు ఇవ్వడం ఎవరికీ అంతుపట్టడంలేదు.

 • జగన్ మాటలను cచూసుకుంటే. ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే ఆలోచన లో ఉందా.

 • కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా జగన్ కు ఆ విషయం ముందే తెలిసిందా అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీలోనే బయలుదేరాయి. మరికొంత మంది శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడను గుర్తుకు చేసుకుంటున్నారు.

 • విచారణ సంస్థలు చంద్రబాబును అరెస్ట్ చేస్తాయని జగన్ భావిస్తున్నారని. అందుకే నాలుగైదు నెలల్లోనే ఎన్నికలొస్తాయని ఊహిస్తున్నారని మరికొందరు సెటైర్ వేస్తున్నారు.

 • -

  అయితే ప్రస్తుత పార్టీ పరిస్థితిపై పీకే టీం సర్వే నిర్వహించిందని, ఆ సర్వే ప్రకారం చాలా నియోజకవర్గాల్లో పార్టీ వీక్ గా ఉందని, దీంతో ఆ ఇన్ చార్జ్ లకు జగన్ క్లాస్ పీకారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచడానికి జగన్ ముందస్తు ఎన్నికలంటూ ప్రకటన చేసి ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.