నాకు చైత్రపై ప్రేమ ఉంది...కానీ తనకి నాపై ద్వేషం ఉంది.! ఆ సంఘటన మా ఇద్దర్ని ఒక్కటి చేసింది.!  

A Successful Moral Love Story-

వాల్మీకి మహర్షి నారద మహర్షిని, “ఎవడున్నాడు ఈ లోకం లో నిత్యం సత్యం పలికే వాడు” అని అడగటంతో రామాయణం మొదలైతే…ఈ కథ మాత్రం ఒక ప్రేమలో పడ్డ యువకుడు రెండు మనసుల ప్రేమను మూడు ముళ్ళ బంధం గా ఎలా మార్చుకున్నాడో చెప్పే సంభాషణతో మొదలవుతుంది…..

నాకు చైత్రపై ప్రేమ ఉంది...కానీ తనకి నాపై ద్వేషం ఉంది.! ఆ సంఘటన మా ఇద్దర్ని ఒక్కటి చేసింది.!-A Successful Moral Love Story

నాలుగు సంవత్సరాల బీ.టెక్ అయిపోగానే చేతిలో ఐదు ఆఫర్ లెటర్లు .ఒక్కోటి ఆరు లక్షల ప్యాకేజివి. చైతన్య అనే నా పేరుకి తగ్గట్టుగా సంపాదించుకున్న నాకు ఏడు అంతస్తుల మేడ ఎనిమిది కోట్ల ఆస్థి ఉన్నా… నెలకి తొమ్మిది వేల జీతంకి పది నెలల నుండి ఎందుకు పని చేస్తునానో మీకు తెలియాలంటే పదకొండు నెలల ముందు నా జీవితం లో చోటు చేసుకున్న సంఘటన మీకు తెలియాలి…

నేనొక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున రోజులవి …డబ్బు కోసం ఏ పని చేయడానికైనా, ఎవర్ని ముంచడానికైనా నేను సిద్దమే…ఎందుకంటే ఈ రోజుల్లో పైసలున్నోడే పుణ్యక్షేత్రాలకు వెళ్ళగలుగుతాడు…పైసలున్నోడే పూజలు చేయించ గల్తాడు…ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం లో ఎంట్రీ కావాలంటే స్విస్ బాంక్లో ఎ ఉండాలనే భావన నాలో బలంగా నాటుకుపోయింది…నాకు మతం మీద నమ్మకం లేదు…ఎందుకంటే ఎవరికైనా రూపాయి ఉంటేనే సమాజం లో విలువ…చివరికి గుడిలో దేవుడిని కోరుకోవాలన్న కావాల్సింది రూపాయే కదా…ప్రపంచ చరిత్ర అంటే ప్రపంచం లో విజయం సాదించినోడి చరిత్ర…అందుకే గెలుపంటే నాకు ఇష్టం…

ఇలాంటి ఆలోచనా విధానం ఉన్న నేను, చైత్ర మాసం తొలి రోజు తొలి పండుగ ఉగాది రోజు కూడా ఆఫీస్ కి వెళ్తే జీతం ఎక్కువ వస్తుందని, పండగ చేస్కోకుండా ఆఫీస్ కి వెళ్ళడం లో ఆశ్చర్యం ఏం లేదు…ఉదయం ఎనిమిదికి ఉగాది అయినా బైక్ మీద ఆఫీస్ కి భయలుదేరాను…బస్ స్టాపు వైపు గా వెళుతుంటే నా ఫ్రెండ్ సారధి కన్పించాడు…

ఇక్కడ వాడి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది…ఎందుకంటే ఏదో పొందడం గెలుపు కాదు, ఏదో కోల్పోవడం ఓటమి కాదు అనే కొత్త వింత ఆలోచన విధానం కల్గిన వాడు కాబట్టి… ఓ సారి వాడికి తెలియకుండా వాడికి షేర్స్ రాకుండా మోసం చేశాను…ఇప్పుడు కూడా వాడిని బైక్ ఎక్కించుకుంటే పెట్రోల్ పైసలు సగం వాడి దగ్గర తీసుకోవచ్చు అని బైక్ ఆపాను…..

వాడు కూడా సెలవు రోజు డ్యూటీకి పోతున్నాడు. వాడు పోయేది కూడా డబ్బు కోసమే…కానీ వాడికోసం వాడు ఎప్పుడు డబ్బు కర్చుపెట్టుకోడు…ధానాలు ధర్మాలు అంటూ ఇచ్చేసే పిచ్చోడు…

వాడి గురించి చెబుతూ అసలైన విషయం చెప్పడం మరిచిపోయా…అదేంటంటే చిత్రమైన ప్రేమను పరిచయం చేసి నా ఎదకి చైత్రం తీస్కొచ్చిన తెలుగింటి అమ్మాయికి నిలువెత్తు రూపంలా ఉండే చైత్ర ని తొలిసారి చూసింది అప్పుడే…మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడిపోయా…కానీ నా స్నేహితుడితో నా మాటలు విన్న చైత్రకి నా మీద తప్పుడు అబిప్రాయం ఏర్పడింది…అందుకే ఫేస్‌బుక్ లో రిక్వెస్ట్ కొట్టినా బ్లాక్ చేసింది…

అయినా మంచితనంకి మారు పేరు అయిన అమ్మాయి సైకోకి సినానిమ్ అయిన నన్ను ఎలా ప్రేమిస్తుంది…నా స్టేటస్ తో తనని ఎలాగైనా నాతో ప్రేమలో పడేలా చేస్కుందాం అనుకున్నా…అది మూర్కత్వంతో కూడిన అమాయకత్వం అని తర్వాత తెలిసింది…ఇంతలో అనుకోని విధంగా ఒక బ్యాచ్ వాళ్ళు నన్ను కొట్టారు…దెబ్బలు బాగా తగిలాయి…రక్తం చాలా పోయింది…ఎవరు కొట్టారా అని మీకు డౌట్ రావొచ్చు నా లాంటి వాడిని కొట్టడానికి కారణం ఏం ఉంటది…ఇంతక ముందు ఎప్పుడో వాడిని మోసం చేసుంటా…అందుకే వాడు గ్యాంగ్ ని వేస్కొచ్చి కొట్టించాడు…కానీ దీని వళ్ళ ఒక మంచే జరిగింది…జీవితం అంటే ఎంతో తెల్సొచ్చింది…నేనేం తప్పు చేసానో అర్ధం అయింది…నిజమైన ప్రేమ పరిచయం అయిందిఅది ఎలా అంటే వాళ్ళు కొట్టడం వళ్ళ…దెబ్బలు బాగా తగిలాయి, రక్తం బాగా పోవడంతో…నన్ను హాస్పిటల్ లో చేర్పించారు…హాస్పిటల్ లో చేర్పించింది ఎవరో కాదు చైత్ర…నాకు రక్తం దానం చేసింది సారధి…..

అలా ప్రేమ అంటే ఏంటో…స్నేహం అంటే ఏంటో అర్ధం అయింది…నేను చేసే ఉద్యోగం ఏం ప్రయోజనం లేనిది…మనుషుల గురించి ఏం నేర్పించదు సమాజంకి ఏ విధంగా సహాయ పడదు అని రాజీనామా చేసి, ఒక చారిటబుల్ ట్రస్ట్ లో నెలకి తొమ్మిది వేల జీతం కి మార్కెటింగ్ మానేజర్ ఉద్యోగంలో చేరాను…

నా ప్రేమను చెప్దాం అని చైత్ర ని కలిసి చెప్పా…కానీ తను “జాలితో మాత్రమే సాయం చేశాను, ప్రేమ తో కాదు, నీ మీద ద్వేషం మాత్రమే ఉంది,” అని చెప్పి వెళ్ళిపోయింది… ఇక్కడ బోనస్ గా నా ప్రేమ విషయం వాళ్ళ నాన్న గారికి కూడా కలిపి చెప్పడం జరిగింది…ఆయన అప్పుడు అక్కడ ఉన్నది నేను చూస్కోలేదు…దానితో తనని పీజి చదువు కోసం వేరే ఊరికి పంపించేశారు…

ఈ పరిస్థితిని సమస్యగా అనుకొని బాద పడుతూ తిట్టుకోవడం మానేసి, పరిస్థితిని అంగీకరించడం మొదలు పెట్టా…ఎందుకంటే అందరికి అందరు నచ్చాలని లేదు…అయినా నేను గతం లో చేసిన తప్పులే నాకు ఈ శిక్షను వేసాయి అని అర్ధం అయింది…అలాగే నేను ప్రస్తుతం చేసే మంచి పనుల వళ్ళ నా భవిష్యత్తు కచ్చితంగా మారుతుంది…

అమ్మాయి గురించి ఏం తెలియకుండా లవ్ ఎలా చేస్తావు అనే నా స్నేహితుల ప్రశ్నకి నా సామాదనం ఒక్కటే…”వ్యాపారం చేయడానికి వివరాలు కావాలి కానీ ప్రేమించడానికి ఎందుకు…అయినా ద్వేషించే మనిషికి సహాయం చేసింది, ఇది ఒక్కటి చాలు తన మనసు మంచిదని చెప్పడానికి…ఇంకేం తెల్సుకోవాలి…”

చైత్రకి నాపై ద్వేషం ఉంది…నాకు తన పై ప్రేమ ఉంది…ప్రేమ అయినా ద్వేషం అయినా మనసులోనే కదా ఉండేది…అంటే ఒకరి మనసులో ఒకరు ఉన్నాం…కాబట్టి మా కలయిక ముందుంది…ద్వేషం కాస్త ప్రేమగా మారుతుందనే నమ్మకం ఉంది …

కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే…చారిటబల్ ట్రస్ట్ లో ఉద్యోగం చేరినప్పుడే సివిల్స్ కోచింగ్ లో జాయిన్ అయ్యాను… ఈ కారణంగా పది నెలల నుండి తొమ్మిది వేల జీతంకి పని చేస్తున్నా…ఇక్కడితో పదకొండు నెలలుగా నా జీవితం లో జరిగిన సంఘటనలు మీకు అర్దం అయింది…

ఇంతలో మరో ఏడాది వచ్చింది…శ్రీ రామ నవమికి చైత్ర మేము పోయిన సంవత్సరం కలిసిన గుడికి వస్తదని తెలిసి వెళ్ళాను…

ప్రతి కథ లాగే నా కథ కూడా నా పెళ్ళితో సుకాంతం అయింది…

ఏ సమస్య అయినా మనిషిని చంపెంతది కాదు…మనం ఉండగా చావు రాదు…అది వచ్చాక మనం ఉండం…మనకు తెలియని దాని గురించి మనకెందుకు …సంతోషంగా జీవితం గడుపుతూ అందర్నీ సంతోషంగా ఉంచుదాం…