వైరల్ వీడియో : ప్రేమికుడి వింత ప్రపోజల్ ప్రియురాలి కొంప ముంచింది..ఏం జరిగిందో మీరే చూడండి.  

  • ఒక చేత్తో గులాబి,మరో చేత్తో ప్రేమలేఖ పట్టుకుని లవ్ ప్రపోజ్ చేసే రోజులు పోయాయి లవ్ ప్రపోజల్ అంటే ప్రేమికురాలికి మాత్రమే కాదు,అందరికి గుర్తుండిపోయేలా ఉండాలని ప్రపోజల్ ని కొత్తగా ప్లాన్ చేస్తున్నవారెందరోఈ కాలపు కుర్రాళ్లందరిలాగే ఓ యువకుడు కూడా తన ప్రేయసికి కొత్తగా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ ఆ కొత్త లవ్ ప్రపోజల్ ప్రియురాలి కొంప ముంచింది.ఇంతకీ ఏం జరిగిందంటే

  • A Love Proposal Makes Trouble For His Girl-

    A Love Proposal Makes Trouble For His Girl

  • ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ కి గాల్లోనే ప్రపోజ్ చేయాలని భావించాడు ఈ యువకుడుఅనుకున్నట్టగానే విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత విమానంలోని ఎయిర్ హోస్టెస్‌ గా ఉన్న గర్ల్ ఫ్రెండ్కు ప్రపోజ్ చేశాడు…విమానంలో ఉద్యోగ బాద్యతలు నిర్వర్తిస్తున్న టైంలో సడెన్‌గా అతడు తనకు ప్రపోజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక మొదట షాక్‌కు గురయింది. తర్వాత మనోడి ప్రపోజల్ నచ్చి ఓకే చెప్పింది. వాళ్ల లవ్ అయితే సక్సెస్ అయింది కానీ విమానంలో జరిగిన ఈ ఘటన వల్ల ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ పోగొట్టుకోవాల్సి వచ్చిందిఈ ఘటన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది.

  • A Love Proposal Makes Trouble For His Girl-
  • మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్యాసెంజర్ల బాగోగులు చూడకుండా నీ పర్సనల్ పనులను చేసుకోవడమేందని ఆ యువతిని జాబ్‌లోనుంచి పీకేసింది సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ.

  • ఆ యువతికి ప్రపోజ్ చేస్తుండగా కొంతమంది వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ విషయం కాస్త ఎయిర్‌లైన్స్ అధికారులకు తెలియడంతో ఆమె జాబ్‌కు ఎసరొచ్చింది.అదండీ అసలు సంగతిఇప్పుడు తన ఉద్యోగం పోగొట్టిన ప్రేమకి బ్రేక్ పడుతుందోలేదంటే ఉద్యోగం కంటే ప్రేమే ముఖ్యం అనుకుంటుందో మరి…