నేను నీతో రాను..నువ్ వెళ్లిపో అమ్మా ప్లీజ్ అని కన్నతల్లిని వేడుకుంటున్న చిన్నారి..ఎందుకో తెలుసా??  

4 Years Boy Love On Grandmother-

ఆ చిన్నారి చిన్నప్పటినుండి నాన్నమ్మ దగ్గరే పెరిగాడు.నాన్నమ్మ చేతి గోరిముద్దలే తింటూ,నాన్నమ్మ చేయ్ పట్టుకుని తిరుగుతూ...

నేను నీతో రాను..నువ్ వెళ్లిపో అమ్మా ప్లీజ్ అని కన్నతల్లిని వేడుకుంటున్న చిన్నారి..ఎందుకో తెలుసా??-4 Years Boy Love On Grandmother

నాన్నమ్మ చెప్పింది వింటూ.నాన్నమ్మ పక్కనే పడుకుంటూ .ఇలా తన రోజులన్ని నాన్నమ్మతోనే గడిచాయి.

నాన్న శాశ్వతంగా దూరమైతే.అమ్మ వదిలివెళ్లిపోయింది.దాంతో నాన్నమ్మ తప్ప మరోలోకం తెలియకుండా పెరిగాడు.ఇప్పుడు ఆ తల్లి నా బిడ్డ నాకు కావాలంటూ రావడంతో… అటు అమ్మతో వెళ్లలేక,ఇటు నాన్నమ్మతో ఉండలేక ఆ చిన్నారి సతమతమవుతున్నాడు

టోలీచౌకికి చెందిన సయ్యద్‌గౌస్, ఫర్హీన్ దంపతులు. వీరికి నాలుగేళ్ల సయ్యద్ సయీద్ కొడుకు ఉన్నాడు.

ఏడాది క్రితం గౌస్ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఫర్హీన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి సయీద్ తన నాయనమ్మ నసీంభాను దగ్గరే పెరుగుతున్నాడు...

ఇటీవల తన కొడుకును తనకు అప్పగించాలని అత్త నసీంబాను ఫర్హీన్ కోరింది.దానికి అత్త కూడా అంగీకరించింది.

కానీ బాధగానే.ఎందుకంటే కన్నకొడుకు దూరమయ్యాడు.ఇప్పుడు కొడుకు ప్రతిరూపం మనుమడు దూరం అయితే ఆ తల్లి మనసుకి బాధ కలిగినా ఒప్పుకుంది.

కానీ ఆ చిన్నారి సయీద్ మాత్రం తాను తల్లిదగ్గరికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. నాయనమ్మ దగ్గరే ఉంటానని పట్టుబట్టి కూర్చున్నాడు.

దీంతో ఫర్హీన్ కొడుకును తనకు అప్పగించాలని డీసీపీని ఆశ్రయించింది.

ఆయన ఆదేశాల మేరకు పోలీసులు సయీద్‌, నాయనమ్మ నసీంబానుతో పాటు తల్లి ఫర్హీన్ పోలీస్టేషన్‌కు పిలిపించారు. బాలుడిని అమ్మతో వెళ్లిపోమని సూచించారు. దీనికి బాలుడు తాను నాయనమ్మ దగ్గరే ఉంటానని పోలీసులకు తేల్చి చెప్పాడు.

కానీ ఆ తల్లి వినలేదు. ఆ పిల్లాడు ఏడుస్తున్నా వినకుండా తన వెంట రావాలని ఆదేశించింది. దీంతో ఆ బాలుడు ‘నీతో తమ్ముడు ఆయాన్ ఉన్నాడు కదమ్మా.

వాడిని చూసుకుంటూ ఉండమ్మా. నేను నాయనమ్మతోనే ఉంటాను ప్లీజ్ వెళ్లిపో అమ్మా’ అంటూ తల్లిని బతిమాలాడు.పిల్లాడి మాటలు విన్న పోలీసులకు ఏం చేయాలో అర్దం కాలేదు.దాంతో చిన్నారిని తల్లితో పంపాలా, నాయనమ్మకు అప్పగించాలా అన్న దానిపై పోలీసులు న్యాయనిపుణల సలహా తీసుకోనున్నారు.

చూడాలి ఏం జరుగుతుందో.