కువైట్ వలస జీవులకి గుడ్ న్యూస్..మూడు నెలలపాటు..  

3 Months Visitors Visa Gives Kuwait For Nri People-

గల్ఫ్ కంట్రీస్ గా పేరొందిన కువైట్ కి అత్యధికంగా వివిధ దేశాల నుంచీ ప్రజలు ఉద్యోగ నిమ్మిత్తం వలసలు వెళ్తూ ఉంటారు అయితే ఈ పరిస్థితుల్లో ఎంతో మంది వలసలు వెళ్ళిన ప్రజలు వారి వారి కుటుంభ సభ్యులకి ఒక నెల పాటు పర్యాటక వీసా ఇచ్చే వారు అయితే ఈ విసా నిభందానని సవరిస్తూ కువైట్ ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న ఎన్నారైలకి శుభవార్త చెప్పింది.అదేంటంటే...

కువైట్ వలస జీవులకి గుడ్ న్యూస్..మూడు నెలలపాటు..-3 Months Visitors Visa Gives Kuwait For NRI People

కేవలం నెలపాటు ఇస్తున్న పర్యాటక వీసాని వారి వారి భార్యా పిల్లలు పర్యటించేందుకు మూడు నెలలపాటు పర్యాటక వీసా జారీ చేయనుంది…ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి షేక్ ఫైసల్ అల్-నవర్ ఓ సర్క్యూలర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 16 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఒక నెల పర్యాటక వీసా పొందిన వలసదారుల భార్య, పిల్లలు వారి వీసా గడువును పెంచుకోవచ్చునని వివరించారు.

తమకి దూరంగా కువైట్ లో ఉంటున్న భార్యా భర్తలు తమ కుటుంభ సభ్యులతో హాయిగా గడపాలని అనుకునే వారికి మానవీయ కోణంలో కువైట్ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది… ఈ నిర్ణయం స్థానిక మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని ఈ నిబంధన కేవలం వలసదారుల భార్యలు, పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని.ఇతరులు ఎవరికిని ఈ నిభందన వర్తించదని వారు తెలిపారు.