సంతానంనకు రాశి చక్రాలకు సంబంధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు     2018-05-06   22:54:23  IST  Raghu V

కొన్ని జంటలు పెళ్లి అయ్యాక తల్లితండ్రులుగా మారటానికి కొంత సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది సహజమే. అయితే కొంత మంది మాత్రం పిల్లలను ఎప్పుడు ఎత్తుకుందామా అని ఆత్రుత పడుతూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలకు రాశి చక్రాలకు సంబంధం ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. అవును సంబంధం ఉంటుంది. ఇప్పుడు రాశి చక్రం ద్వారా సంతానానికి సంబందించిన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మేష రాశి మేష రాశి వారు సంతానం విషయంలో అంత సుముఖంగా ఉండరు. వీరికి జీవితంలో పిల్లలు అనేది చివరి అప్షన్ గా ఉంటుంది. పిల్లలు కలిగితే వీరి పేరును ఎక్కడ తగ్గించేస్తారో అనే అభద్రతా భావం ఉంటుంది.

వృషభ రాశి ఈ రాశి వారికి పిల్లలు కావాలా వద్దా అనే విషయంలో చాలా గందరగోళంగా ఉంటారు. వీరికి స్పష్టమైన ఆలోచన అనేది ఉండదు. పిల్లలు ఉంటే వారికి అన్ని సౌకర్యాలు కల్పించగలమా అనే సంశయం ఉంటుంది.

మిధున రాశి ఈ రాశి వారు తెలివిగా ఉన్నా సరే పిల్లల విషయంలో కాస్త వెనకడుగు వేస్తారు. వీరు పిల్లల భాద్యతలను ఒక అడ్డంకిగా భావిస్తారు. పిల్లలు కలిగిన తర్వాత కూడా వారు సామజిక సంబంధాలకు దూరంగా ఉండరు.

కర్కాటక రాశి ఈ రాశి వారిలో తల్లితండ్రులు కావాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. వివాహం అయిన దగ్గర నుండి పిల్లల కోసం తహతహలాడుతూ ఉంటారు. వీరికి పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా చాలా అంచనాలు ఉంటాయి.

సింహ రాశి ఈ రాశి వారికి పిల్లలు ఉండాలనే భావన అనేది ఉండదు. అన్ని కాలానుగుణంగా జరుగుతాయనే ఆలోచనలో ఉంటారు. అయితే పిల్లలు పుట్టాక వారి అభివృద్ధి కోసం చాలా కష్టపడతారు.

కన్య రాశి ఈ రాశి వారు కూడా పిల్లల విషయంలో పెద్దగా ముందడుగు వేయటానికి ఇష్టపడరు. వీరు ప్రణాళికాబద్ధంగా ఉంటారు. పిల్లలను కూడా ఒక ప్రణాళిక ప్రకారమే భాద్యతగా భావిస్తారు.