మరో దేవదాసుకు రెడీ అవుతున్నాడట!     2018-05-25   01:13:41  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమ వారికి వైవీఎస్‌ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందరికి గుర్తిండిపోయే చిత్రాలు చేశాడు. విభిన్న ప్రేమ కథ చిత్రాల దర్శకుడిగా, ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా చౌదరి పేరు తెచ్చుకున్నాడు. కాని ఈయన గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ మొదటి సినిమా ‘రేయ్‌’తో ఈయన స్థాయి మరింతగా దిగజారింది. అయినా కూడా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గతంలో దేవదాసు చిత్రంతో ఆకట్టుకున్న చౌదరి మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు.

రామ్‌, ఇలియానాలను హీరో హీరోయిన్‌ుగా పరిచయం చేస్తూ ‘దేవదాస్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమాలో ఇంకా ఎంతో మంది కొత్త వారికి ఛాన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడంతో చౌదరి స్థాయి పెరగడంతో పాటు, ఆ సినిమాలో నటించిన కొత్త నటీనటులు ఉన్నత స్థాయికి వెళ్లి పోయారు. ఆ చిత్రం తర్వాత చేసిన చిత్రాలు అడపా దడపా సక్సెస్‌లు అవుతూ, ఫెయిల్‌ అవుతూ వచ్చాయి. ఒక్క మగాడు, రేయ్‌, సలీం చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడటంతో నిర్మాతగా కూడా చౌదరి కుదేలయ్యాడు. దాంతో కొంత గ్యాప్‌ తీసుకున్న ఈయన మళ్లీ రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రకటించాడు.