వైసీపీలోకి వైఎస్ శ‌త్రువు కుమారుడు.... అస‌లు క‌థేంటి..!     2018-04-15   07:43:18  IST  Bhanu C

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎవ‌రు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో కూడా ఊహించ‌లే ని ప‌రిస్థితి. రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. అప్ప‌టికంతే.. ! అని స‌ర్దు కోవ‌డం త‌ప్ప చేయాల్సింది ఏమీ ఉండదు. ఇలాంటి ఓ ఊహించ‌ని ప‌రిణామ‌మే తాజాగా రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, వైఎస్‌కు ప్ర‌ధాన శ‌త్రువుగా ప‌రిగ‌ణించ‌బ‌డిన ఎంవీ మైసూరా రెడ్డి.. త‌న‌యుడు.. ఎంవీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. నిజానికి ఎంవీ, వైఎస్ కుటుంబాల‌కు తీవ్ర స్థాయిలో శ‌త్రుత్వం న‌డిచింది. వైఎస్ అంటే ఎంవీకి, ఎంవీ అంటే వైఎస్‌కు ఒక్క నిముషం కూడా ప‌డేది కాదు. ప్ర‌తి విష‌యంలోనూ కారాలు మిరియాలు నూరుకున్నారు. అలాంటి కుటుంబం రాజ‌కీయంగా ప‌లు ఒడిదుడుకులు ఎదుర్కొంది.


ఈ క్ర‌మంలోనే మైసూరా రెడ్డి త‌న అభిప్రాయ భేదాల‌ను , వైరాల‌ను కూడా ప‌క్క‌న పెట్టి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్‌కు జై కొట్టారు. తండ్రికి శ‌త్రువే అయినా కొడుకుకు మిత్రుడు అనే రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ కూడా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఎంవీని గౌర‌వించారు. అయితే, త‌ర్వాత జ‌గ‌న్‌తోనూ ఎంవీ విభేదించారు. జ‌గ‌న్‌ను `సార్‌` అని పిల‌వాల్సి వ‌స్తోంద‌ని, సీనియ‌ర్ల‌కు ఆయ‌న విలువ ఇవ్వ‌డం లేద‌ని, ప్ర‌తి విష‌యంలోనూ త‌న నిర్ణ‌యమే ఫైన‌ల్ అంటున్నాడ‌ని, సీనియ‌ర్ల‌మైన త‌మ సూచ‌న‌ల‌ను, స‌ల‌హాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా ఎంవీ అప్ప‌ట్లోనే విమ‌ర్శించారు. భారీ ఎత్తున మీడియాకు కూడా ఎక్కారు. దీంతో ఇరు వురి మ‌ధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి.