ఆయ‌నొచ్చాడు... వైసీపీలో ముస‌లం పుట్టించాడు     2018-04-11   08:12:01  IST  Bhanu C

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లు… టిక్కెట్ల నేప‌థ్యంలో క‌ప్పుల త‌క్కెడ‌లు స్టార్ట్ అయ్యాయి. ఎన్నిక‌లు యేడాది ఉండ‌గానే అప్పుడే పొలిటిక‌ల్ హీట్ ఇక్క‌డ మామూలుగా లేదు. అధికార‌ప‌క్షంలో ఉన్న వారు టిక్కెట్లు వ‌స్తాయ‌న్న ధీమా లేక‌పోవ‌డంతో కొంద‌రు ఇప్పుడు టిక్కెట్ కోసం విప‌క్ష వైసీపీని న‌మ్ముకుని ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. మ‌రి అధికార పార్టీ వాళ్లు విప‌క్షంలోకి వ‌స్తే ఇప్పటి వ‌ర‌కు అక్క‌డ పార్టీని న‌మ్ముకుని టిక్కెట్ రేసులో ఉన్న వారి ప‌రిస్థితి ఏంటి ? మ‌రి ముస‌లం మొద‌ల‌వుతుంది క‌దా.. ఇప్పుడు విజ‌య‌వాడ వైసీపీలో అదే జ‌రుగుతోంది.

విజ‌య‌వాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ ఎంట్రీ ఇప్పుడు అక్క‌డ వైసీపీలో ముస‌లం రేపుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ వైసీపీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణుకు, వంగ‌వీటి రాధాకు ప‌డ‌డం లేదు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి మ‌ధ్య సెంట్ర‌ల్ సీటు విష‌యంలో వార్ జ‌రుగుతోంది. మ‌ల్లాది పార్టీలోకి రావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంగవీటి రాధాను సెంట్రల్‌ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించారు. సెంట్రల్‌ నియోజకవర్గ టికెట్‌ ఇప్పుడు వంగవీటి రాధా, విష్ణులలో ఎవరికి ఇస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.