టీడీపీ స్వ‌యంకృతం.. జ‌గ‌న్‌కు ఆ జిల్లా స‌లాం     2018-05-06   23:58:54  IST  Bhanu C

చేసుకున్న వారికి చేసుకున్నంత‌! అనేది తెలుగు సామెత‌. ఇప్పుడు ఈ సామెత ఖ‌చ్చితంగా తెలుగు దేశం నేత‌ల‌కు స‌రిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టిన అధికారాన్ని త‌మ ఇష్టానుసారం వినియోగించుకోవ‌డం త‌మ్ముళ్లకు తెలిసినంతగా ఎవ‌రికీ తెలిద‌య ద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో పార్టీ ప‌రంగా అతి చేస్తూ.. త‌మ ఇష్ట‌మే పార్టీ ఇష్ట‌మ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా టీడీపీకి ఎదురు దెబ్బ‌త‌గిలేలా చేస్తోంది. ఫ‌లితంగా రాజ‌ధానిలో అత్యంత కీల‌క‌మైన ఓ జిల్లా మొత్తం.. విప‌క్ష నాయకుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఖాతాలోకి వెళ్లిపోతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌ధాని ప్రాంత జిల్లా అయిన గుంటూరులో టీడీపీ హ‌వా భారీ ఎత్తున సాగింది. ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ ఉవ్వెత్తున ఎగిసి ప‌డింది. మొత్తం 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో 12 చోట్ల విజ‌యం సాధించింది. దీంతో త‌మ‌కు తిరుగు లేద‌ని పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు భావించారు. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లా నుంచి కీల‌క వ్య‌క్తుల‌ను మంత్రులుగా కూడా తీసుకున్నారు. క‌ట్ చేస్తే.. నాలుగేళ్లు తిరిగే స‌రికి ప‌రిస్థితి మారిపోయింది. ఇప్పుడు టీడీపీ అంటేనే గుంటూరు ప్ర‌జ‌లు ఏవ‌గించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ 12 మంది 12 ర‌కాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. ఫ‌లితంగా వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెబుతున్నారు.

గుంటూరులోని పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన కొమ్మాల పాటి శ్రీధ‌ర్‌కు అధినేత చంద్ర‌బాబుతో అనుబంధం దాదాపు క‌ట్ అయిపోయింది. ఆయ‌న త‌న సొంత వ్యాపారాలు, సెటిల్మెంట్ల‌తో బిజీబిజీగా గ‌డ‌ప‌డంతోనే స‌రిపెడుతున్నారు. ఇక‌, పార్టీ కార్య‌క్ర‌మాల జోలికి కూడా పోవ‌డం లేదు. ఇక‌, అంతో ఇంతో ప్ర‌జ‌ల్లో తిరిగే.. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌పై కొంద‌రు చెప్పిన మాట‌లు విన్న పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు. రాజధాని రైతుల ప‌క్షాన ఆయ‌న నిలిచి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప‌రిష్కారం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.