వైసీపీ ఒంటరేనట ! తోడు అవసరమే లేదట    2018-06-19   00:00:26  IST  Bhanu C

ఏపీలో తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది. బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుందని.. ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకుంటారని టీడీపీ విమర్శలు గుప్పిస్తుండడంతో… ఆ అపవాదు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ సిద్దమైయింది ఈ మేరకు తాము ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడంలేదని.. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వైసీపీ ప్రకటించింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ముడిపెడుతూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం.. ఏపీలో బీజేపీ పై ప్రజల్లో ఆగ్రహం ఎక్కువ ఉండడంతో ఆ ప్రభావం తమ పార్టీపై పడకుండా వైసీపీ వ్యవహరిస్తోంది. అందుకే.. కొద్దిరోజుల క్రితమే ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేసారు.