టీడీపీ వారికే ఈ ప్రశ్నలు అట ! సమాధానం అడుగుతున్న వైసీపీ !     2018-06-16   23:35:17  IST  Bhanu C

నాలుగేళ్లు కలిసి తిరిగారు .. ఒకరి కేబినెట్లో ఒకరు పదవులు పంచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కేంద్ర అధికార పార్టీ బీజేపీ ప్రశంసిస్తే… బీజేపీ బ్రమ్మాండంగా పనిచేస్తోందని టీడీపీ పొగిడింది. అయితే వారి మధ్య విబేధాలు వచ్చాయి. ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది అని, తెలుగుదేశం విమర్శలు చేసి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది….ముఖ్యంగా ఎన్డీయే నుంచి టీడీపీ ఇదే విషయంపై విభేదించి బయటకు వచ్చింది.. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు నాయకులు టీడీపీని అడిగేవి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

1. ప్రధాని నరేంద్రమోదీని అమరావతికి శంకుస్తాపనకు ఆహ్వానించింది ఎవరు?
2. .400 కోట్ల రూపాయలతో ఆర్బాటంగా కార్యక్రమం చేయించింది ఎవరు?
3.. నీరు మట్టి తీసుకురమ్మని మోదికి చెప్పింది ఎవరు?
4.. బీజేపీ నాయకులతో నాలుగేళ్లు కలిసింది ఎవరు?
5.. ప్రత్యేక హూదా సంజీవనా అని ప్రశ్నించింది ఎవరు?
6.. ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాలు వస్తాయా అని క్వశ్చన్ వేసింది ఎవరు?
7.. మన రాష్ట్రానికి కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చింది అని చెప్పంది మీరు కాదా? అది పచ్చ పత్రికల్లో రాలేదా?