ys sharmila Kept between Jagan and prashanth kishore

నార్త్‌లో ప్ర‌శాంత్ కిషోర్ పేరు చెపితే అప్ర‌తిహిత విజ‌యాల‌కు కేరాఫ్‌. అలాంటి ప్ర‌శాంత్ కిషోర్‌ను ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్.జ‌గ‌న్ 2019లో త‌న గెలుపుకోసం రంగంలోకి దించాడు. ఫ‌స్ట్ టైం నార్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌శాంత్ కిషోర్ జ‌గ‌న్ గెలుపు కోసం ఇప్ప‌టికే త‌న వ్యూహాలు ప్రారంభించేశాడు. ఈ క్ర‌మంలోనే ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే స‌ర్వే స్టార్ట్ చేసిన పీకే బృందాలు ఓ నివేదిక త‌యారు చేసి జ‌గ‌న్‌కు ఇచ్చేయ‌డం కూడా జ‌రిగింది.

ఈ క్ర‌మంలోనే పీకే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కొంద‌రు ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను ప‌క్క‌న పెట్టేయాని చెప్పిన‌ట్టు కూడా స‌మాచారం. జ‌గ‌న్ అంటేనే సాధార‌ణంగా ఎవ్వ‌రి మాట విన‌ని ఓ మొండి ఘ‌టం అన్న టాక్ ఉంది. అయితే పీకే విష‌యంలో మాత్రం నూటికి నూరు శాతం ఆయ‌న చెప్పిన వ్యూహాల‌నే అమ‌లు చేస్తున్నాడ‌ట‌. జ‌గ‌న్ పీకే మాట విన‌డం చాలా మందికే న‌మ్మ‌శ‌క్యంగా లేదు.+