జగన్ ,విజసాయిల మధ్య చిచ్చుపెడుతున్న షర్మిలా...రీజన్ ఇదేనా    2018-03-18   01:16:28  IST  Bhanu C

జగన్ కి ఏ పోరు తప్పినా సరే ఇంటి పోరు మాత్రం తప్పడం లేదు…జగన్ పాద యాత్ర ప్రారంభించిన సమయం నుంచీ మొన్నటి వరకూ కూడా వైసీపి నుంచీ కీలక నేతలు అందరు టిడిపి పార్టీ లోకి వెళ్ళిపోతూ వచ్చారు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు జగన్ కి ఘలక్ ఇవ్వగా కొంత మంది కీలక నేతలు జగన కి బై బై చెప్పడంతో జగన్ కి గట్టి షాక్ తగిలింది.ఒక పక్క వైసేపి నుంచే కీలక నేతలు వెళ్ళిపోయి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పుడు ఇంటి పోరు మొదలయ్యింది అంతేకాదు జగన్ ఆత్మగా చెప్పుకునే విజయసాయి రెడ్డి కి జగన్ కి మధ్య జగన్ చెల్లెలు షర్మిల చిచ్చు పెడుతోందనే టాక్ వినిపిస్తోంది..ఇంతకీ అసలు ఏమయ్యింది ఎందుకు షర్మిల జగన కి పంటికింది రాయిలా అయ్యింది అంటే.

ఒక పక్క వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పాగా వేయటం కోసం వైసిపి కసరత్తులు చేస్తోంది…గతంలో ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పార్లమెంటును చేజార్చు కావడంతో ఈ సారి గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది..మరో పక్క అసెంబ్లీ సీట్లు కూడా చేజిక్కించుకోవాలని ఆరాట పడుతోంది..ఈ రెండు లక్ష్యాలు సాధించటం కోసం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు…విజయ సాయి కూడా విశాఖపట్నం జిల్లాను దత్తత తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం లోక్ సభ స్ధానంపై దృష్టి పెట్టారు.