ఆ దూకుడే వైసీపీ కొంప ముంచబోతోందా ..     2018-08-13   13:04:07  IST  Sai M

రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా ఆచూతూచి మాట్లాడాలి. ముందు తమ నోటికొచ్చింది మాట్లాడేసి ఆ తరువాత తీరిగ్గా నాలుక కరుచుకుంటే కుదరదు కదా ! అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఆ తరువాత లబోదిబోమన్నా కుదరదు. ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే ఆయన కూడా ఆ విధంగానే తన తొందరపాటుతో అత్యంత సున్నితమైన కాపు రిజర్వేషన్ అంశం పై మాట్లాడి అనవసర వివివాదం కొని తెచ్చుకున్నాడని ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కాపు నేతలే ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా పార్టీ నిలదొక్కుకుంటుందనుకున్న సమయంలో జగన్ ఈ విషయాన్ని కదిపాడు. ఇప్పుడు మేము నియోజకవర్గాల్లో ఎలా తలెత్తుకు తిరగాలి , దీనివల్ల కాపు ఓట్లకు గండి పడుతుంది కదా ఇవన్నీ జగన్ ఆలోచించుకోకపోతే ఎలా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mudragada,ys Jagan,ys Jagan On Kapu Reservationm,YS Jagan's Tongue Mistake Makes More Damage,Ysrcp

వైసీపీకి ఇప్పుడు మూడు జిల్లాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అన్ని పార్టీలకు ఆ జిల్లాయే చాలా కీలకం. అన్నిపార్టీలకు గుండెకాయ వంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ఇప్పుడు ఎదురు గాలి వీస్తోందన్న వార్తలు ఇప్పుడు వైసీపీని ఆందోళనకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో కోల్పోయిన అధికారాన్ని ఇప్పుడు సాధించాలని జగన్ భావిస్తున్నారు. ఒకవైపు పార్టీ కేడర్‌ను నిలుపుకోవడం సహా పార్టీని ఆర్థిక సమస్యల నుంచి బయటపడెయ్యడం అత్యవసరం. ఈ నేప థ్యంలోనే ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు.

జగన్ తొందరపాటుతో చేసిన వ్యాఖ్యలు కాపు సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉన్న ఈ మూడు జిల్లాల్లో ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సానుభూతి కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యల మూలంగా కొట్టుకు పోయిందనే విమర్శలు వస్తున్నాయి. రాజశేఖరరెడ్డి సీఎం కావడానికి ఈ మూడు జిల్లాలు ఎంతో సహకరించాయి. మరి ఈ జిల్లాలను తనకు అనుకూలంగా మలుచుకుని ముందుకు సాగడంలో జగన్ విఫలం అవుతున్నారు.

Mudragada,ys Jagan,ys Jagan On Kapu Reservationm,YS Jagan's Tongue Mistake Makes More Damage,Ysrcp

కొన్ని కొన్ని వివాదస్పద విషయాల జోలికి వెళ్లకపోవడమే జగన్ కి కూడా మంచిది. కొన్ని కొన్ని విషయాల్లో రాజకీయ లౌక్యం ప్రదర్శించాలి. ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడేస్తాను అంటే కుదరదు. కాపులకు రిజర్వేషన్ అంశం అనేది కొన్ని దశాబ్దాలుగా ఉన్న విషయమేనని, ఇప్పుడు కొత్తగా తెరమీదికి వచ్చింది లేదని, అందరూ దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటుంటే.. జగన్ మాత్రం సూటిగా మాట్లాడేసి కాపులను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు నష్ట నివారణ కోసం ఎన్ని హామీలు ఇచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడుఈ అదే వైసీపీ నాయకుల బాధ కూడా .