టీడీపీని జగన్ ఎదుర్కోలేడా ..? కారణం ఇదేనా .. ?  

పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఎప్పుడు సీఎం కుర్చీ ఎక్కేద్దామా అని తహలాడుతున్న వైసీపీ అధినేత జగన్ ఆశలు గత ఎన్నికల్లో అడియాసలు అయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న జగన్ ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు తన కాళ్ళకు పనిచెప్పి మరీ పాదయాత్ర చేపడుతున్నాడు. కానీ అధికార పార్టీ టీడీపీ మాత్రం కొంచెం రిలాక్స్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. జగన్ ధీమా ఒక్కటే.. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు తనను అధికారంలోకి తీసుకువస్తాయి అని జగన్ భావిస్తున్నాడు. ప్రజల్లోనూ జగన్ కు మంచి ఆదరణ ఉన్నట్టుగానే కనిపిస్తోంది.

జగన్ ఎన్నికల కోసం అంత హైరానా పడుతుంటే బాబు మాత్రం ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నాడు అనేదానికి సమాధానం కూడా ఉంది. అదేంటంటే … పోల్ మెనేజ్మెంట్‌. దీంట్లో చంద్రబాబుని మించిన వారు లేరనిధి రాజకీయ పండితులు అందరికి తెలుసు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఇదే విషయం తేలింది. అక్కడ వైసీపీ గెలుపు ఖాయం అని అంతా భావించినా .. వైసీపీ అభ్యర్థి మాత్రం ఓటమి చవిచూశాడు. అంటే, బాబు పోల్ మెనేజ్మెంట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. మరి వచ్చే ఎలెక్షన్స్‌లో సీఎం కావాలని కలలు కంటున్న జగన్ పోల్ మెనేజ్మెంట్‌లో అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు మాత్రం కనిపించడంలేదు.