నోరుజారిన జగన్ ... ఇక కృష్ణ లో కృష్ణార్పణం     2018-05-10   02:09:51  IST  Bhanu C

నోరుంది కదా అని ఎడా పెడా హామీలు ఇచ్చేస్తే ఆ తరువాత నాలుక కరుచుకోవాల్సిందే అనేది వైఎస్సార్ సీపీ అధినేత జగన్ వ్యవహారం చుసిన ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ సామజిక వర్గం ఓట్లు భారీగా పొందాలని జగన్ భావించాడు. అయితే ఆ ప్రకటన జగన్ కు ఏ మాత్రం కలిసి రాకపోగా కొంపలు మునిగే పరిస్థితి తలెత్తడంతో అనవసరంగా ఈ వివాదంలో చిక్కుకున్ననే అని జగన్ లో లోపల తెగ భాధపడిపోతున్నాడట.

ఇక ఆ జిల్లాకు చెందిన సొంత నేతలు సైతం జగన్ ప్రకటనపై గుర్రుగా ఉన్నారట. రాయలసీమ జిల్లాల్లో ఉన్న రాజకీయం వేరు కృష్ణ జిల్లా రాజకీయాలు వేరు. ఇక్కడ కులం అనేది ప్రధానంగా ఉంటుంది. ఏ పార్టీ గెలవలన్నా ఇదే ఆధారం. కృష్ణ జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రవేశించినప్పుడు జగన్ కు లభించిన స్పందన చూసి ఆయనకు కన్ను మిన్ను అనలేదని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.