YS Jagan Targets Tollwood

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా విన్ అవ్వాల‌న్న కోరిక‌తో విప‌క్ష వైకాపా అధినేత ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు నాయ‌కుల‌ను, సీనియ‌ర్ల‌ను, ప‌లువురు సెల‌బ్రిటీల‌ను సైతం త‌న పార్టీలో చేర్చుకునేందుకు చ‌క‌చ‌కా స్కెచ్‌లు గీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీకి కీల‌క‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల‌ను టార్గెట్ చేసిన జ‌గ‌న్ ఈ రెండు జిల్లాల నుంచి పలువురు కీల‌క‌మైన వ్య‌క్తుల‌ను పార్టీలో చేర్చుకున్నారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ క‌న్ను ఇప్పుడు టాలీవుడ్‌పై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ప‌లువువురు ప్ర‌ముఖుల‌ను త‌న పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడ‌ని…ఇందుకోసం జ‌గ‌న్ స్వ‌యంగా వాళ్ల ఇళ్ల‌కు వెళ్లి మ‌రి వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి టాలీవుడ్‌కు ఏపీలో అధికార టీడీపీకి అవినాభావ సంబంధం ఉంది. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, దివంగ‌త మాజీ సీఎం టాలీవుడ్ దిగ్గ‌జ హీరో కావ‌డంతో టాలీవుడ్‌లో ఎక్కువ మంది టీడీపీ వైపే ఉంటూ వ‌స్తున్నారు.

ఎన్టీఆర్ త‌ర్వాత చంద్ర‌బాబు కూడా టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు త‌న పార్టీ త‌ర‌పున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తూ ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ సైతం టాలీవుడ్‌లో ముగ్గురు ప్ర‌ముఖుల‌ను త‌న పార్టీలో చేర్చుకునేందుకు పెద్ద క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, ఆయ‌న శిష్యుడు క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు, టాలీవుడ్ కింగ్‌, మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున ఈ ముగ్గురు ప్ర‌ముఖుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగానే వైసీపీలో చేర్చుకునే బిగ్ స్కెచ్ రెడీ అవుతోంద‌ట‌.

మోహ‌న్‌బాబు ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రి బంధువు. జ‌గ‌న్ చిన్నాన్న కుమార్తె వెరోనిక మోహ‌న్‌బాబు పెద్ద కోడ‌లు అయ్యింది. చంద్ర‌బాబుతో అంత స‌ఖ్య‌త లేని మోహ‌న్‌బాబు ఇంట‌ర్న‌ల్‌గా జ‌గ‌న్‌కే మ‌ద్ద‌తు ఇస్తున్నార‌న్న టాక్ ఉంది. ఇక దాస‌రి సైతం కాపు ఉద్య‌మం త‌ర్వాత చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ దాస‌రిని స్వ‌యంగా క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇక కింగ్ అక్కినేని నాగార్జున సైతం జ‌గ‌న్‌కు బంధువు అవుతున్నారు.

నాగార్జున రెండో కుమారుడు అఖిల్ పెళ్లి చేసుకుంటోన్న శ్రియా భూపాల్‌రెడ్డి, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే రెడ్డి మ‌నుమ‌రాలు. జీవీకే రెడ్డికి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి బంధుత్వం ఉంది. ఇలా జ‌గ‌న్ కూడా ఇప్పుడు నాగార్జున‌కు స‌మీప బంధువు అవుతున్నాడు. నాగార్జున వ్యాపారాల‌న్ని జ‌గ‌న్ స‌మీప బంధువుల‌తోనే జాయింట్‌గా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నాగ్ కూడా వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ ఈ మేర‌కు ఇప్ప‌టికే నాగ్‌ను ఒప్పించిన‌ట్టు కూడా స‌మాచారం.

ఈ ముగ్గురికి వైసీపీ నుంచి ఏదో ఒక సీటును జ‌గ‌న్ ఇస్తాడ‌ని కూడా టాక్‌. మ‌రి 2019 ఎన్నిక‌ల నాటికి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో చూడాలి.