టీడీపి టార్గెట్ గా ఫలిస్తున్న జగన్ వ్యూహం..     2018-05-10   04:14:37  IST  Bhanu C

కృష్ణా జిల్లా టీడీపి నేతలని ఆకర్షించడంలో జగన్ వేసుకున్న వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి కేవలం కృష్ణా జిల్లానే కాదు గుంటూరు జిల్లా వైపు కూడా జగన్ తన వ్యుహలని అమలు చేస్తున్నాడు..ఒక పక్క కృష్ణా జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి సీనియ‌ర్ నేత వ‌సంత కృష్ణ ప్రసాద్ గురువారం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారు..రాజ‌ధాని జిల్లాలైన కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవాలంటే క‌చ్చితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నేత‌ల మ‌ద్ద‌తు లేకుండా సాధ్యం కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే…అయితే జ‌నాభా ప్రాతిపదికన చూసుకుంటే.. క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి పై చేయి కాక‌పోయినా ద‌శాబ్దాల రాజ‌కీయ అధికారం మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హించ‌టంతోనే క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌ల‌ను ఆకర్షించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.

జగన్ పాదయాత్ర సమయంలో కోస్తా జిల్లాల‌కు సంబంధించి ఏ జిల్లాలో ఎవ‌రిని వైసిపిలో చేర్చుకోవాల‌న్న విష‌యంలో వైసిపి నేత‌లు భారీ ప్లాన్స్ వేసుకున్నారు అందులో భాగంగానే నెల్లూరు జిల్లాతో చేరిక‌లు మొద‌లైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో రిజ‌ల్ట్ కాస్త‌ క‌నిపించినా కృష్ణా జిల్లాలో మాత్రం చెప్పుకోత‌గ్గ ఫ‌లితాలే క‌న‌బ‌డుతున్నాయి. జిల్లాలోకి అడుగుపెట్టిన రోజే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంఎల్ఏ, టిడిపి సీనియ‌ర్ నేత య‌ల‌మంచిలి ర‌వి వైసిపిలో చేరారు. ఇపుడు వ‌సంత చేర‌బోతున్నారు. త్వ‌ర‌లో గ‌న్న‌వ‌రంలో సీనియ‌ర్ నేత దాస‌రి జై ర‌మేష్ కూడా వైసిపిలో చేరుతారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది…అయితే కీలక జిల్లా అందులోనూ కీలక నేతలు అయిన ముగ్గురు వెళ్ళిపోయే అవకాసం ఉండటంతో.. జిల్లా టీడీపీ లో టెన్షన్ వాతావరం నెలకొంది.