జగన్ సంచలన ప్రకటన..వేడెక్కిన ఏపీ రాజకీయం     2018-06-12   23:17:33  IST  Bhanu C

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం గౌడిపల్లి లో అకిరాస కులం సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ. వైసీపీ అధికారంలోకి వస్తే అకిరాస కులానికి ప్రత్యేక కార్పరేషన్ ఏర్పాటు చేస్తానని బీసీల సమస్యలను చట్టసభల్లో చర్చించి న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు..ఉభయగోదావరి జిల్లాలలో బీసీ ఓట్లు అధికంగా ఉంటాయి అయితే ఈ రెండు జిల్లాలపై వైసీపికి పట్టులేదు..దాంతో జగన్ వ్యుహత్మకంగానే ఈ నిర్ణయం ప్రకటించాడని అంటున్నారు విశ్లేషకులు..

ఇదిలాఉంటే జగన్ జపిస్తున్నబీసీ మంత్రంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ ని తనవైపుకి తిప్పుకున్న జగన్ అటు కాపుల ఓట్లు ఎటూ పోకుండా ఇటు బీసీ ఓట్లు కి గురి పెట్టాడని..వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రభావం కేవలం కుల సమీకారణాలపై ఆధారపడి ఉంది కాబట్టి జగన్ ముందుగానే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పవచ్చు అంటున్నారు పరిశీలకులు.