YS jagan Surveillance Pawan kalyan Moments

పవ‌న్‌క‌ళ్యాణ్ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో కాపులో యూత్ ఓట‌ర్ల‌తో పాటు మెజార్టీ ఓట్లు జ‌న‌సేనకే ప‌డ‌తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంచ‌నా వేస్తున్నారు. మిగిలిన వ‌ర్గాల్లో యువ‌తలో కొంద‌రు కూడా ప‌వ‌న్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్‌కు కొత్త‌గా ప‌వ‌న్ టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ‌ల్లే తాను అధికారంలోకి దూర‌మ‌య్యాన‌ని భావిస్తోన్న జ‌గ‌న్ ఇప్పుడు జ‌న‌సేన స్టెప్పుల‌తో పాటు ప‌వ‌న్ క‌ద‌లిక‌ల‌పై త‌న టీంతో నిఘా వేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యం జ‌న‌సేన వ‌ర్గాల‌కు సైతం తెలియ‌డంతో వారు కూడా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల ప‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే కాబోయే సీఎం ప‌వ‌ర్‌స్టార్ అన్న నినాదాలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీకి ధీటైన ప్ర‌త్య‌ర్థిగా నిల‌వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు సైతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక మీడియాలో కొన్ని వ‌ర్గాలు సైతం జ‌న‌సేన‌కు అండ‌గా ఉంటాయ‌ని వ‌స్తోన్న వార్త‌లు జ‌గ‌న్ శిబిరంలో మ‌రింత క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయ‌ట‌. టీవీ 9 ర‌విప్ర‌కాశ్‌తో పాటు ఎన్డీవీ అండ ప‌వ‌న్‌కు ఉండొచ్చ‌ని అంటున్నారు. ప‌వ‌న్ ఏమాత్రం బ‌లంగా ఉన్నా మ‌రోసారి జ‌గ‌న్ అధికారానికి దూర‌మ‌య్యే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో మ‌రి ప‌వ‌న్‌ను జ‌గ‌న్ ఎలా నిలువ‌రిస్తాడో చూడాలి.