YS jagan Surveillance Pawan kalyan Moments

రాజ‌కీయాల్లో మ‌నం ఏం చేస్తున్నాం అనేదానికంటే మ‌న శ‌త్రువులు ఏం చేస్తున్నార‌న్న‌ది చాలా ముఖ్యం. ప్ర‌త్య‌ర్థుల క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌డిక‌ప్పుడు ప‌సిగ‌డుతూ మ‌నం అడుగులు ముందుకు వేసిన‌ప్పుడే రాజ‌కీయాల్లో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతాం. ఈ క్ర‌మంలోనే ఏపీలో 2019లో అధికారంలోకి వ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం త‌మ‌కు పోటీగా రెడీ అవుతోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై సైతం నిఘా పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి జ‌గ‌న్‌కు నిన్న‌టి వ‌ర‌కు కేవ‌లం చంద్ర‌బాబు గురించి మాత్ర‌మే ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉండేది. ఇప్పుడు చంద్ర‌బాబుతో పాటు 2019లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ గురించి సైతం ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోస్తాలోని కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌పై జ‌గ‌న్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే జ‌న‌సేన ఎంట్రీ ఇస్తే ఆ ఓట్ల‌లో చాలా వ‌ర‌కు ఆ పార్టీకే ప‌డే ఛాన్సులు ఉన్నాయి.