“చంద్రబాబు కి చెమటలు” పట్టిస్తున్న...“జగన్ స్కెచ్”    2018-04-03   01:46:41  IST  Bhanu C

ఏపీ రాజకీయాలో జగన్ భారీ వ్యుహాన్ని అమలు చేయబోతున్నారా..? ఇప్పటి వరకూ జరిగిన రాజకీయాలు వేరు ఇక మీదట జగన్ వేయబోయే రాజకీయ అడుగులు వేరు అనేట్టుగా వ్యూహాలు పన్నుతున్నారా..? ఇప్పటి వరకూ ఒకలెక్క ఇప్పటి నుంచీ ఒక లెక్క అంటూ వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న స్కెచ్ మాములుగా లేదు అంటున్నారు…జగన్ వ్యూహం అధికార టిడిపికి ముర్చెమటలు పట్టిస్తోందట…ఇంతకీ జగన్ అమలు చేయనున్న వ్యూహం ఏమిటి..? అపర చానిక్యుడు చంద్రబాబు కి సైతం చెమటలు పట్టిస్తున్న జగన్ తాజా వ్యూహం ఎలా ఉండబోతోందనే వివరాలలోకి వెళ్తే..

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ లో వైసీపి ఎంపీలు చేసిన ఆమరణ నిరాహార దీక్షలకి మద్దతుగా ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో రిలీ దీక్షలు ప్రారంభించాలని జగన్ పిలుపు ఇచ్చారు..అంతేకాదు తాము చేసే ఈ దీక్షలకి అక్కడి ఉండే సంస్థలని..అన్ని వర్గాల వారిని కలుపుకుని పోరాటం చేయాలని తెలిపారు..ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులకి ,పార్లమెంటు సభ్యులకి సమన్వయ కర్తలకి, దిశానిర్దేశం చేశారు..పార్టీకి చెందినా ముఖ్య నాయకులు .విద్యార్ధి సంఘాలు ,మహిళా సంఘాలతో కలిపి చర్చా గోష్టిలు పెట్టి వారి మద్దతు కూడగాట్టేలా చేయాలనీ ఆదేశించారు..నిరాహార దీక్షలు చేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదని అన్నారు..