జ‌గ‌న్ `క‌మ్మ` జ‌పం.. పెద్ద క‌థే ఉందే..!     2018-04-25   23:56:13  IST  Bhanu C

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. అధికారంలోకి వ‌చ్చేందుకు విప‌క్షాలు, అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు అధికార ప‌క్షాలు ఎప్ప‌టిక‌ప్పుడు పోటీ ప‌డుతూనే ఉంటాయి. ఏపీలోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. అధికార పార్టీ టీడీపీ త‌న అధికారాన్ని తిరిగి నిల‌బెట్టుకునేందుకు నానా ప్ర‌యాస ప‌డుతోంది. వివిధ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతోంది. ఇక‌, విప‌క్షం వైసీపీ అధినేత వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్ర ప్ర‌యాస ప‌డుతున్నారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లు, వివిధ ప‌థ‌కాల‌పై హామీలు, వివిధ పార్టీల నుంచి నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డం వంటివి జ‌గ‌న్ చేప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఓటు బ్యాంకును భారీ ఎత్తున దెబ్బ కొట్టేందుకు జ‌గ‌న్ వ్యూహం సిద్ధం చేసుకున్నాడు.

దీనిలో భాగంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న వైపు తిప్పుకొనేందుకు రెడీ అయ్యాడు. ఏపీలోని మొత్తం 25 పార్లమెంట్ సీట్ల‌లో రిజ‌ర్వుడు టికెట్లు పోను మిగిలిన 20 సీట్ల‌లో ఐదు సీట్ల‌ను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ నేత‌లే చెబుతున్నారు. ప్ర‌ధానంగా టీడీపీకి ఎక్క‌డ అనుకూలంగా ఉంటుందో చూసుకుని, అక్క‌డే చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చేలా జ‌గ‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం సీట్లను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి జ‌గ‌న్ కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, విశాఖ ఎంపీ సీటును మాత్రం విజ‌య‌సాయి రెడ్డి కోరుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆ సీటును మిన‌హాయిస్తే.. మ‌రో సీటును క‌మ్మ వ‌ర్గానికి కేటాయిస్తార‌ని అంటున్నారు.